Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్య, పంచాయతీరాజ్,ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బందితో రివ్యూ
నవతెలంగాణ-మంగపేట
మండలంలో జరిపిన ఈ-హెల్త్ ప్రోఫైల్ సర్వేలో మండలంలో 60 శాతం ప్రజలకు షుగర్, బీపీ ఉన్నట్లు నివేదికలు రావడంతో రాష్ట్ర వైద్య ఆరో గ్య సంచాలకుల ఆదేశాలతో ఆ సర్వేను రీసర్వే చేసి ఈ నెల 15 వరకు నివేధిక అందజేయాలని మండల స్పెషల్ ఆఫీసర్ తుల రవి అన్నారు. మంగళవారం మండల పరిషత్ క్యాలయంలో వైద్య, పంచాయతీ రాజ్, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బందితో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ-హెల్త్ ప్రోఫైల్ సర్వేలో ములుగు జిల్లాలోని మంగపేట మండలంలో చేసిన సర్వేలో మండల వాసులకు 60 శాతం షుగర్, బీపీ ఉన్నట్లు నివేధికలు వచ్చాయని దీనిని పరిశీలించిన రాష్ట్ర వైధ్యఆరోగ్యశాఖ కమీషన రేట్ మండలంలోని 60 శాతం మందికి షుగర్, బీపీ ఉండడాన్ని తీవ్రంగా పరిగణించి నిర్ఘంతపోయిందని ఆయన తెలిపారు. ఈ-హెల్త్ ప్రోఫైల్ సర్వేలో తప్పులు జరిగినట్లు భావించి మండలంలో మళ్లీ రీ సర్వే చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచాల కులు జిల్లా కలెక్టర్ ను ఆదేశించడంతో ఇటీవల జిల్లా కేంద్రంలో జరిగిన రివ్యూలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని రి సర్వే చేయాలని ఆదేశించడంతో ఈ రివ్యూ ఏర్పాటు చేసినట్లు తుల రవి తెలిపారు. రీ సర్వే కోసం పంచాయతీరాజ్, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బందిని ఉపయోగించుకోని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రీ సర్వే త్వరితగతిన చేపట్టాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. సమావేశంలో ఎంపీడీఓ కర్నాటి శ్రీధర్, వైద్యులు యమున, నిఖిల్ పాల్గొన్నారు.