Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి కిరణ్
నవతెలంగాణ-భూపాలపల్లి
పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మొటిక్ చార్జీలతోపాటు స్కాలర్షిప్స్ పెంచాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దామెర కిరణ్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాల యంలో డీఎస్డీఓ సునితను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ 2017 సంవత్సరం నుండి ఇప్పటి వరకు గడిచిన ఆరు సంవత్సరాల కాలంలో నిత్య వసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు మెస్ కాస్మొ టిక్ చార్జీలు పెంచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నాయన్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు రూ.35 తో మూడు పూటల నాసిరకం భోజనం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యా ప్తంగా విద్యార్థులకు పౌష్టికాహారం అందక అర్థా కలితో అలమటిస్తూ విద్యను అభ్యసిస్తున్నారని వాపో యారు. జిల్లాలోని వసతి గృహంలో విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందించట్లేదని ఆరోపిం చారు. మెస్, కాస్మొటిక్ చార్జీలతోపాటు స్కాలర్ షిప్స్ పెంచకుంటే సమరశీల పోరాటాలు నిర్వహి స్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు విష్ణు, మనోజ్ ,వరుణ్ తేజ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.