Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
యువత విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణిం చాలని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. మంగళవారం స్థానిక డిగ్రీ కళాశాలలో యువజన సర్వీసులు క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు 2023 కార్యక్రమాన్ని శాఖ అధికారి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శశాంక ముఖ్య అతిథిగా హాజరై స్వామి వివే కానంద చిత్రపటానికి పూలమాలవేసి నివాళలు అ ర్పించారు. అనంతరం సభను జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడా రు. యువత విద్య అభ్యసిస్తూ క్రీడల్లో, సాంస్కతిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ అన్ని రంగాలలో నూ రాణించాలని, ఆరోగ్యంతో ఉన్నప్పుడే విద్యలో ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతామన్నారు.స్వామి వివేకానంద చిన్నతనంలోనే యువతను ఉత్తేజపరచి న గొప్ప వ్యక్తులుగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంతోనే మనం ఈరోజు మహానుభావుడు వివే కానంద జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిం చు కోగలుగుతున్నామన్నారు. అనంతరం యువతీ యువకులు ప్రదర్శించిన జానపద నత్యాలు ఆకట్టుకు న్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి అనిల్ కుమార్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రా జు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి సత్య నారాయణ, జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు, జిల్లా పౌర సంబంధాల అధికారి శ్రీనివాసరావు, యు వతి, యువకులు తదితరులు పాల్గొన్నారు.