Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిన్నగూడూరు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ లను అమలు పరచాలని సీపీఐ నియోజకవర్గ కార్యద ర్శి నల్లు సుధాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండ ల కేంద్రంలో ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొ ని మాట్లాడారు. ఆయా మండల కేంద్రాలలో ఆస్పత్రు లు, జూనియర్ కళాశాలల నిర్మాణం, డబుల్ బెడ్ ఇం డ్లలో జరిగే అవినీతి, పేదలకు ఇళ్ల స్థలాలు, దళిత బంధు సంక్షేమ పథకాలలో పారదర్శకత వహించే విధంగా పరిశీలన చేపట్టాలన్నారు. గ్రామాలలో మౌలిక వసతుల కల్పన కోసం నిర్మాణాత్మక పోరాటా లకు రూపకల్పన చేయాలని పిలుపునిచ్చారు. యువత కు ఏటాకోటి ఉద్యోగాలు, నల్లధనం వెలికితీత, రాష్ట్ర విభజన హామీల అమలు, లక్ష రూపాయల రైతు రుణ మాఫీ, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు లాంటి హామీల ను అమలు పరచాలని డిమాండ్ చేశారు. ఈ సమా వేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పోగుల శ్రీనివాస్ గౌడ్, నెల్లూరు నాగేశ్వరరావు చిన్న గూడూరు మండల కార్యదర్శి గంజి శేషాద్రి రెడ్డి, కొరవి మండల కా ర్యదర్శి కరణం రాజన్న, మరిపెడ మండల సహాయ కార్యదర్శి అబ్దుల్ రషీద్, బుర్ర సమ్మయ్య, తురక రమేష్, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.