Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జీ.నాగయ్య
నవతెలంగాణ-మహబూబాబాద్
సావిత్రిబాయి పోలే పోరాట స్ఫూర్తితో విద్యా సామాజిక హక్కుల కోసం పోరాడాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జీ.నాగయ్య పిలుపు నిచ్చారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఘనం గా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహిం చారు. కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు యనమల కిరణ్ అధ్యక్షతన స్థానిక జగన్నాథం భవన్లో సావిత్రిబాయి పూలే 192 వ జన్మదినం పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి జయంతి కార్యక్రమా న్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాగయ్య మాట్లా డుతూ సావిత్రిబాయి పూలే భారతీయ సంఘ సం స్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి, ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫూలే భార్య అని అన్నారు. ఆమె తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించి బాలికలకు విద్య నేర్పిన మొదటి మహి ళా గురువు అని కొనియాడారు. కుల వ్యవస్థకు, పితృ స్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పశ్యుల, మ హిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం త మ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించా రన్నారు. కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు సాదుల శ్రీని వాస్ మాట్లాడుతూ పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమ కారిణి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుడ్డెల రామ్మూర్తి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మందుల మహేందర్ డొనక దర్గయ్య, బిర్రు కిరణ్, పులిపాక నాగరాజు, ఇతరప్రజా సంఘా ల నాయకులు తదితరులు పాల్గొన్నారు.