Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్
నవతెలంగాణ-పర్వతగిరి
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కషి చేస్తోంద ని, అలాగే రాఫ్ట్రంలోని ప్రతీ గ్రామంలో పారిశుద్యం, పచ్చదనంతో పాటు ఆరోగ్య తెలంగాణ నిర్మించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్థన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తెలిపారు. పర్వతగిరి మండలం లోని వడ్లకొండ, కల్లెడ, ముంజాలకుంట తండా గ్రామాలలో మంగళవారం సుమారు రూ.3.60 కోట్లతో చేపట్టిన వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డ్, రైతు వేదికలు, క్రీడా ప్రాంగణం, ఆరోగ్య కేం ద్రం, మహిళా భవనం అంతర్గత సిసి రోడ్లు వంటి పనులను ఎమ్మెల్యే ప్రారంభిం చారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని గ్రామా లను అభివృద్ది చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అన్నారు. దీనిలో భాగంగా ప్రతీ నెల గ్రామ పంచాయితీలకు నిధులు కేటాయిస్తు న్నట్లు తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో ఇప్పటికే గ్రామాల్లో ఘననీయమైన అ భివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా లేన టువంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలం గాణ ప్రభుత్వమేనన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎంకేసీఆర్ పని చేస్తు నారని తెలిపారు. రైతు బంధు, రైతు భీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు, కేసీఆర్కిట్ వంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలను అందిస్తోందని అన్నా రు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కమల,జడ్పీటిసి బానోతు సింగులాల్,జెడ్పీ కో ఆప్ష న్ సభ్యుడు మహమ్మద్ సర్వర్,వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు అమడగాని రాజు యాదవ్,మాజీ ఎంపీపీ రంగు రజి త, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షులు చిన్నపాక శ్రీనివాస్,ఆయా గ్రామా ల సర్పంచ్ లు రాజుయాదవ్, శోభారాణి,వడ్ల కొండ ఎంపిటిసి అత్తి రేవతి, ఎంపి డిఒ చక్రాల సంతోష్ కుమార్,మండల వ్యవసాయ అధికారి టి.ప్రశాంత్ కుమార్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.