Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎం జిల్లా కన్వీనర్ బోట్ల చక్రపాణి
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
అణగారిన వర్గాల జీవితాల్లో అక్షర దారిని చూ పిన తల్లి సావిత్రిబాయి పూలే అని సిపిఎం పార్టీ హ న్మకొండ జిల్లా కన్వీనర్, బొట్ల చక్రపాణి అన్నారు. మంగళవారం రాంనగర్ సీపీఎం పార్టీ ఆఫీసులో సా విత్రిబాయి పూలే 192వ జయంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారినవర్గాల, బాలికల వి ద్య, సామాజిక దురాచారాలను రూపుమాపడం కో సం సావిత్రిబాయి పూలేచేసిన కృషిని కొనియాడారు. కులవ్యవస్థ బాగా ప్రభలిపోయిన సమాజంలో అంద రూ సత్యాన్ని శోధించడానికి కంకణం కట్టుకోవాలనే తత్వాన్ని ప్రచారం చేస్తూ1873లో ఫూలే దంపతులు సత్యశోధక్ సమాజ్ ప్రారంభించి బాల్యవివాహలకు, మూఢనమ్మకాలకు, సతీసహగమనానికి వ్యతిరేకంగా పోరాడి వితంతువు పునఃర్వివాహలకు మద్దతుగా ఉ ద్యమాలు నడిపి అణగారిన వర్గాల్లో చైతన్యం నింపిద న్నా రు. కానీ 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇప్పటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు మహిళల హక్కులను కల్పిం చడంలో విఫలమైందన్నారు. వారికి సమాజంలో కనీ సం రక్షణ లేకపోగా, వారిపై అత్యాచారాలు, దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకుని సామాజిక సేవకు, దేశాభివృద్ధికి ప్రతిఒక్కరు పాటుప డాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సారంపెల్లి వాసుదేవరెడ్డి, జి.ప్రభాకర్‌రెడ్డి, ఎం . చు క్కయ్య, వాంకుడోతు వీరన్న, గొడుగు వెంకట్, మం ద సంపత్, డి.తిరుపతి, భానునాయక్, నోముల కిషో ర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
గొప్ప సంఘ సంస్కర్త : సిహెచ్.చుక్కయ్య
ఎన్జీవోస్ కాలనీ : సావిత్రిబాయి పూలే గారి 192 వ జయంతి సందర్భంగా మంగళవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలోజిల్లా ఆఫీస్ లో కెవిపిస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ గారి అధ్యక్షతన జ రిగిన ఇష్టాగోష్టి కార్యక్రమము నిర్వహించడం జరిగిం ది. ఈ కార్యక్రమంలో టిపికేఎస్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి నాయకులు సిహెచ్.చుక్కయ్య పాల్గొని మాట్లాడుతూ పందొమ్మిదవ శతాబ్దంలో మహిళా విద్య సాధికారతలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ భారతీయ సంఘ సంస్కర్త, విద్యావేత్త, కవయిత్రి సావిత్రిబాయిపూలే అని ఆ కాలంలో తన భర్త జ్యోతిరావు ఫూలేతో కలిసి బీడేవాడాలో పూణేలో మొ దటి బాలికా పాఠశాలను సాధించిందని, బాల వితం తువులకు విద్యను అందించడం, విముక్తి చేయడం కోసం ఆమె చాలా కృషి చేసింది అని బాల్య వివాహా లు సతి ప్రాతానికి వ్యతిరేకంగా ప్రచారం చేసింది అని వితంతు పునర్వివాహాల కోసం వాదించింది అని తెలిపారు. అలాగే ఆమె అంటరానితనానికి వ్యతిరేకం గా ప్రచారం చేసిందని, కుల, లింగ ఆధారిత వివక్ష ను నిర్మూలించడంలో చురుకుగా పనిచే సిందని తెలి పారు. సావిత్రిబాయి పూలే గారి ఆశయా లను కాపా డుతూ ప్రస్తుత సమాజంలో స్త్రీలపై జరు గుతున్న అఘాయిత్యాలను కులమతపరమైన అస మానతలు తొలగించాలని కోరారు.
ఈ కార్యక్రమం లో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు టీ ఉప్పలయ్య, మత్స్యకార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గొడుగు వెంక ట్ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్ ఐడిడబ్ల్యూఏసౌత్ మండల కార్యదర్శి సాంబ రాజు శ్వేత, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దూడపాక రాజేందర్ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూల మాల వేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సం ఘాల నాయ కులు అలకుంట యాకయ్య, దూడపాక రాజేందర్, ఎన్నము వెంకటేశ్వర్లు, నోముల కిషోర్, ఆలకుంట మల్లయ్య, మేకల రఘుపతి, శ్వేత, రాణి, దుర్గ, శోభ, అనిత, రమేష్, రాజు, సంపత్, మురళి, రామ్ కి, స్రవంతి, చామంతి చందర్ పాల్గొన్నారు.