Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ కె.శశాంక
నవతెలంగాణ-తొర్రూర్ రూరల్
రెండు పడకల ఇండ్ల నిర్మాణ పనులను వేగవం తంగా పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అధికారులను ఆదేశించారు. శుక్ర వారం మండలంలోని మాటేడు గ్రామంలో నిర్మిస్తున్న 50 రెండు పడకల గదుల పనులను కలెక్టర్ పరిశీలిం చారు. 25 ఇండ్లు పూర్తి దశలో నిర్మాణం కాగా 25 ఇండ్లు వివిధ దశల్లో పురోగతిలో ఉండగా ఈ నెల చి వరి నాటికి అన్ని నిర్మాణ పనులు పూర్తిచేసి అందుబా టులోకి తీసుకురావాలని సంబంధిత కాంట్రాక్టర్లను అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమం లో ఆర్డిఓ ఎల్ రమేష్, ఎంపీడీవో, మున్సిపల్ కమిష నర్ కుమార్, తహసిల్దార్ రాఘవరెడ్డి, కాంట్రాక్టర్ చంద్రయ్య, ఇరిగేషన్ ఈఈ ఆర్.రమేష్ బాబు, డిఈ సునీల్ కుమార్, ఏఈ ఈ.శ్రీనివాస రావు, ఏఈ వి. నవ్య, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
తొర్రూరు : రెండు పడకల ఇండ్ల నిర్మాణ పనుల ను వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజే యాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అధికారులను ఆదే శించారు.తొర్రూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్న డూప్లెక్స్ రెండు పడకల గదుల నిర్మాణ పనుల పురో గతిని శుక్రవారం కలెక్టర్ శశాంక పరిశీలించారు. 192 డబల్ బెడ్ రూమ్ నిర్మాణాల్లో 96 పూర్తి దశలో రంగులు కూడా వేయడం జరిగిందని, 96 చివరి నిర్మాణ దశలో ఉన్నాయని మిగిలిన 88 గదులకు టెండర్లు పనులు ప్రారంభమయ్యాయని, 64 స్లాబ్ పడ్డాయని, 40 గోడల నిర్మాణం జరిగాయని, 24 ప్రారంభ దశల్లో పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలపగా... 280 గదులను ఒకేసారి లబ్ధిదారులకు అందించే విధంగా తగు చొరవ చూపా లని, జాప్యం చేయకూడదని,192 గదులకు పూర్తి స్థాయిలో వసతులు కల్పించి ఈనెల చివరిలో లబ్ధి దారులకు అందే విధంగా అధికారులు, కాంట్రాక్టర్ చూడాలని కలెక్టర్ తెలిపారు.88 గదులు మార్చి లోగా పూర్తిచేయాలని, అన్ని పనులకు టెండర్ చేసు కోవాలని, కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్మినిస్ట్రేషన్ రివ్యూ అయి 6 నెలలు అయినప్పటికీ పనుల్లో జాప్యం తగ దని హెచ్చరించారు. మున్సిపాలిటీ నుండి మెయిన్ రోడ్, టాయిలెట్స్ డ్రింకింగ్ వాటర్ సప్లై, రన్నింగ్ వా టర్ను 135 లీటర్స్ చొప్పున అందజేయాలని, బా త్రూంల నిర్మాణాలను ఎస్బిఎం కింద అప్లై చేయాల ని, మొదటగా సంపులకు కనెక్షన్స్ ఇచ్చుకోవాలని, పీహెచ్ నుండి డీడీలు కట్టించాలని, ఏ బ్లాక్ ఆ బ్లాక్ 51 కే ఎల్ సంపులను నిర్మించుకోవాలని సూచించా రు.789 బ్లాక్ బిల్లును ఎన్పీడీసీఎల్కు పే చెయ్యల న్నారు. త్రాగునీరు రన్నింగ్ వాటర్‌ను వేర్వేరుగా అం దించుటకు అవసరమగు బోర్ వెల్స్‌ను వేయించు కోవాలని, అర్బన్‌లో ఉన్న పేద ప్రజలకు త్వరగా అం దించడం వల్ల కేంద్రం అందించే నిధులకు మనము అర్హులము అవుతామని అధికారులు, కాంట్రాక్టర్లు గమనించాలని తెలిపారు. ఎస్బిఎం కామన్ ఇన్ఫా స్ట్రక్చర్ రోడ్లు, డ్రింకింగ్ వాటర్ సైడ్ డ్రైనేజీలు సకల సదుపాయాలతో నిర్మాణం చేయాలని, మొదటి స్పేస్ లోనే తొర్రూర్ పట్టణానికి 280 ఇండ్లు మంజూరు కావడం అదృష్టంగా భావించి అర్హులైన పేదవారికల సహకారం అయ్యేట్లు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలి కలెక్టర్ కాంట్రాక్టర్,సంబంధిత శాఖ అధి కారులను, ప్రజా ప్రతినిధులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామచం ద్రయ్య, వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, ఆర్డిఓ ఎల్ రమేష్, మున్సిపల్ కమిషనర్ కుమార్, తహసిల్దార్ రాఘవరెడ్డి, కాంట్రాక్టర్ చంద్రయ్య, ఇరిగేషన్ ఈఈ ఆర్.రమేష్ బాబు, డిఈ సునీల్ కుమార్, ఏఈ ఈ. శ్రీనివాస రావు, ఏఈ వి.నవ్య, మున్సిపల్ ఏఈ రం జిత్, వార్డు కౌన్సిలర్లు, అధికారులు, ప్రజా ప్రతి నిధులు తదితరులు పాల్గొన్నారు.