Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో కురవి మండలం నేరేడు గ్రామం బాల్య తండాలో నల్ల చేత పీడింపబడుతున్న మిర్చి తోటలను అధికారులు శాస్త్ర వేత్తలు రైతులతో కలిసి సందర్శించి పరిశీలించారు. శుక్రవారం హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాల నుండి వచ్చిన శాస్త్రవేత్తలు మిర్చి తోటలో సందర్శిస్తూ నివారణ చర్యలకు తీసుకునే చర్యలను వివరిస్తూ బేఏరియా, లేకానీసిలియన్, బ్యాసిల్లుస్, సూడోమోనాస్ లాంటి జీవ శిలీంద్రాలు వాడటం వల్ల చాలా వరకు వీటి ఉద్రితి తగ్గుతుందని గమనించినట్లు శాస్త్రవేత్తలు రైతులకు వివరించారు. మిర్చి పూతలో వస్తున్న నల్లి నివారణ చర్యల గురించి శ్రీదేవి సైంటిస్ట్ వివరిం చారు. ఐఐహెచ్ఆర్ బెంగళూరు నుండి రవణప్ప అలాగే ఎంబీఏఐఆర్ బెంగళూ రు నుండి రచన, ఎంబీఏఐఆర్ బెంగళూరు నుండి మిధున్, హైదరాబాదు నుంచి డిడిహెచ్ వేణుగోపాల్ రెడ్డి ఉద్యాన అధికారి మహేష్ కెవికె మల్యాల మాలతి, హెచ్ఆర్ఎస్ మల్యాల భాస్కర్ పాల్గొనగా జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి కే. సూర్యనారాయణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శత్రు నాయక్, ఏవో మరిపెడ వీరాసింగ్ శోభన్ బాబు, డోర్నకల్ డివిజన్ అనిత శ్రీ, 50 మంది రైతులు పాల్గొన్నారు. ఇందులో భాగంగానే నాలుగు శిలీంద్రాలను బ్యాక్టీరియా లను పిచికారీ చేసి టెస్ట్ చేయడం కూడా జరిగిందని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి తెలియజేశారు.