Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి భానోత్ దేవేందర్
నవతెలంగాణ-మహబూబాబాద్
బిజెపి, విశ్వహిందూ పరిషత్ వాళ్లు వినాయక చందా ఇవ్వనం దుకే ఆగస్టు నెలలో జరిగిన విష యాన్ని పని గట్టుకొని 4 నెలల తర్వాత ఇప్పుడు సరస్వతి అనే టీచర్‌ను ఉపాధ్యాయుడు మల్లికార్జున్ కించపరిచాడనీ తప్పుడు ప్రచారం చేస్తు న్నాడని పిడిఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ దేవేందర్ విమర్శించారు. శుక్రవారం మానుకొండలో బట్టు అంజయ్య భవనంలో జరిగిన సమావేశంలో దేవేందర్ మాట్లాడారు. విద్యార్థులకు పాఠాలు బోధించడం లేదని టీచర్ మల్లి కార్జున్ పై అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నిజంగా ఆటీచర్ దేవుళ్ళ ని కించపరిస్తే, పుస్తకాలలో లేని సిలబస్ బోధిస్తే ఆ టీచర్‌పై ఫిర్యాదు చేయాల నుకుంటే సంభందిత అధికారులకు తెలియజేయాలి కానీ ఆ టీచర్ని అవమా నించి బలవంతంగా గుళ్ళోకి తీసుకెళ్ళి బొట్టుపెట్టి, క్షమాపణ చెప్పించడం కులం పేరుతో దూషించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. విద్యాలయాల్లో మతోన్మా దుల ప్రమేయం సిగ్గు చేటు అని అన్నారు. విద్యార్థులకు సిలబస్ లో ఉన్న పాఠం చెబితే వీరికొచ్చే ఇబ్బంది ఏంటో తెలపాలని డిమాండ్ చేశారు. మొక్కించడాలు, బొట్లు పెట్టడం ఎంఈవో, పోలీస్ అధికారాలు ముందే జరగడం మండల విద్యా ధికారి, పోలీస్ అధికారులు దీన్ని ఆపకుండా చూస్తూ ఉండడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఇలాంటి సంఘటనలపై ఉపాద్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు స్పందించాల్సిన అవసరం ఎంతో ఉందని, టీచర్ని అవమానించిన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు భుక్య సతీష్, హరికృష్ణ, ప్రశాంత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.