Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్పీ శరత్ చంద్ర పవర్
నవతెలంగాణ-మహబూబాబాద్
సైబర్ నేరగాళ్లు ఎల్లప్పూడూ ఒక్క అడుగు అడ్వాన్స్ గానే ఉంటున్నారు అని, అతి తెలివిని వాడంటంలో మాకు ఎవరూ పోటీలేరు, పోటీరారు అన్నట్లుగా ముదిరి పోతున్నారు. వారు సృష్టించే నకిలీ వెబ్ సైట్ల బారిన పడవద్దు అని అని మాను కోట ఎస్పీ శరత్ చంద్ర పవర్ సూచించా రు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో మాట్లాడారు. ఒకసారి తమ వలలో చిక్కి నవారిపైనే కొత్త పద్ధతుల్లో అనేక మార్లు వల విసురుతున్నట్లు తెలుస్తోందనీ ఎస్పీ తెలిపారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన కొంతమంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కాంటాక్ట్ నంబర్ల కోసం గూగుల్లో సెర్చ్ చేస్తు న్నారు. ఇలాంటివారిని టార్గెట్ చేసుకుంటున్న సైబర్ కేటుగాళ్లు నకిల కాల్ సెంటర్ల ద్వారా మరోసారి బురిడీ కొట్టిస్తున్నారు అని అన్నారు. సైబర్ బాధితుల ఫిర్యాదుల కోసం సృష్టించిన నకిలీ వెబ్సైట్లలో తప్పుడు కాంటాక్ట్ నంబర్లును ఈ మోసగాళ్లు ఉంచుతున్నారని అన్నారు. ఇందుకోసం కేటుగాళ్లు సృష్టించిన నకిలీ వెబ్సైట్లను గుర్తించినట్లు తెలిపారు. ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ ప్రజలకు సూచించారు. బాధితులు నకిలీ వెబ్ సైట్లలో ఇచ్చిన ఫోన్ నంబర్లకు కాల్ చేస్తే.. మోసపోయిన సొమ్మును రికవరీ చేస్తామని ముందుగా మాయమాట లతో కేటుగాళ్లు నమ్మిస్తున్నారని అన్నారు. బాధితుల బ్యాంకు ఖాతా, ఫోన్ నంబ ర్, అడ్రస్, ఆధార్ నంబర్, సీవీవీ ఇలా పూర్తి వివరాలను నమ్మకంగా సేకరిస్తు న్నారని అన్నారు. ఆ తరువాత వీటిని ఉపయోగించి బాధితుల నుంచి మళ్లీ డబ్బు కొట్టేస్తున్నారని అన్నారు. కొంత మంది బాధితులు ఇటువంటి వివరాలు ఇచ్చేం దుకు అంగీకరించకపోతే... వారి నుంచి ప్రాసెసింగ్ ఫీజు, ఖర్చుల పేరుతో ఇతర రుసుముల రూపంలో దోచుకుంటున్నారన్నారు. ఇలాంటి వారిని ఆన్లైన్లో ఆశ్ర యించవద్దని, డబ్బులు పోగొట్టుకొన్న బాధితులు 1930 నంబర్లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ తెలిపారు.