Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
తొర్రూరు పట్టణ కేం ద్రంలోని పశువుల అంగ డి ఆవరణలో నిర్మించిన ఎనిమల్ బర్త్ కంట్రోల్ (ఏబిసి) కేర్ సెంటర్ను జిల్లా కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించా రు. ఏబిసి సెంటర్కు తీసుకువచ్చిన కుక్కలు తప్పించుకోకుండా చూడాలని, సంతాన ఉత్పత్తి కలగకుండా మగ, ఆడ కుక్కలకు ఆపరేషన్ చేసి జెనెటిక్ ఆర్గాన్స్ ఉత్పత్తి కాకుండా, మరో వాటికి జన్మనివ్వకుండా తగు చర్యలు తీసుకోవడమే ఏబీసీ సెంటర్ యొక్క ప్రధాన ఉద్దేశం అని, కుక్క కరిస్తే రేబిస్ వ్యాధి వస్తుందని తెలియని వారు ఇంజక్షన్ తీసుకోలేకపోతున్నారని, ఒకవేళ కరిస్తే జనరల్ వ్యాక్సిన్ కూడా వేసుకోవాలని, కుక్కల బెడద తీవ్ర మవుతున్న నేపథ్యంలో వాటిని పట్టి ఏసీబీ సెంటర్కు తరలించాలని, అక్కడ వాటికి ఆపరేషన్ చేయడం జరుగుతుందని, ఆపరేషన్ అనంతరం కుక్కల యొక్క సంతాన ఉత్పత్తి, కోపం కరవాలనే గుణాన్ని కోల్పోతాయని, దీనివల్ల క్రమక్ర మంగా వీధి కుక్కలను నివారించవచ్చని అన్నారు.ప్రజా ప్రతినిధులు, అధికారులు తగు ప్రణాళికలు రూపొందించుకోవాలని చుట్టూ మొక్కలను నాటాలని, మిగిలిన పనులను పూర్తి చేసి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా ప్రారంభించుటకు పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, ఆర్డిఓ ఎల్.రమేష్, మున్సిపల్ కమిషనర్ కుమార్, తహసిల్దార్ రాఘవరెడ్డి, ఎనిమల్ హస్బండ్రీ డాక్టర్ వెంకన్న, మున్సిపల్ ఏఈ రంజిత్, వార్డు కౌన్సిలర్లు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.