Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
కేంద్ర ప్రభుత్వం పోడు భూముల పై అవలంబిస్తున్న మొండి వైఖరి నశించా లని బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఆంగోతు శ్రీకాంత్ నాయక్, సేవాలాల్ సేన మహబూబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్య రవి నాయక్ లు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పోడు భూములను వారు సందర్శించి మాట్లాడా రు. అర్హులైన వారందరికీ పోడు హక్కు పత్రాలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లంబాడి ఐక్యవేదిక మండల అధ్యక్షులు జర్పుల శ్రీను నాయక్, గ్రామ శాఖ అధ్యక్షులు దేవోజి నాయక్, నరేష్ నాయక్, హరినాయక్ బోడ బాలు నాయక్ గిరి నాయక్ హరి, శ్రీను, రమేష్, రాము, లచ్చి రామ్, లక్ష్మణ, తులసి, సునీల్, బావుసింగ్ తదితరులు పాల్గొన్నారు.