Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్ డిమాండ్
నవతెలంగాణ-మహబూబాబాద్
దేశవ్యాప్తంగా అంగన్వాడీ, ఆశా, ఐకేపీ, మధ్యాహ్నం భోజనం వంటి వివిధ స్కీంల పట్ల నిర్లక్ష్యం విడనాడి, స్కీంల ప్రైవేటీకరణ ఆపుచేసి, స్కీంలకు బడ్జెట్ పెంచి, కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్కీం వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని దేశ వ్యాప్త నిరసనలో భాగంగా జిల్లా కేంద్రంలో తాసి ల్దార్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తాసిల్ కార్యాలయ అదిధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉపేందర్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్కీము లని ప్రైవేటీకరించేందుకు బడ్జెట్లో 60 శాతానికి కోత విధించిందని విమర్శిం చారు. కరోనా కష్ట కాలంతో పాటు అనేక పథకాలలో వర్కర్లతో వెట్టిచాకిరి చేయిం చుకుంటూ వారి సంక్షేమాన్ని మాత్రం గాలికి వదిలేసిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ఆకాశానంటుతున్న నిత్యావసర సరుకుల ధరలు, మరోవైపు చాలీచాలని వేతనాలతో స్కీం వర్కర్లు దుర్బర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, మోయలేని పని భారంతో కునారిల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్కీం వర్క ర్లకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, స్కీముల ప్రైవేటీకరణ ఆపాలని, బడ్జెట్ పెంచి బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.లేనియెడల స్కీం వర్కర్ల, పేదల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు పట్టణ కన్వీనర్ కుమ్మరి కుంట్ల నాగన్న, వివిధ స్కీం వర్కర్స్ యూని యన్ల జిల్లా, మండల నాయకులు వెలిశాల సుధాకర్, నీలం కృష్ణవేణి, తోట పుష్ప, లలిత, పవన్, మమత, యాకమ్మ, శైలజ, రాణి పాల్గొన్నారు.