Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సోమన్న
నవతెలంగాణ-పాలకుర్తి
పశు వైద్య శాఖలో పశు మిత్రులుగా పనిచేస్తున్న పశుమిత్రలకు వేతనంతో పాటు పనిభద్రత కల్పించాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చిట్యాల సోమ న్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పశు మిత్ర సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు చిలువేరు సంధ్యతో పాటు పశువు మిత్రులతో కలిసి వేతనంతో పాటు పని భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తహసిల్దార్ భూక్య పాల్ సింగ్ నాయ క్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సోమన్న, సంధ్యలు మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు పోషించుకుంటున్న పశువులకు వైద్య సేవలు అందుబాటులో ఉండే విధంగా పశు మిత్రులను ఏర్పాటు చేసిందని తెలిపారు. పశు మిత్రులకు వేతనాలు గుర్తించకపోవడంతో పాటు పని భద్రత లేక శ్రమ దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎనిమిది సంవత్సరాల నుండి ఎలాంటి వేతనం తీసుకోకుండా పశు వైద్య శాఖలో పశువులకు సేవలందిస్తున్నారని తెలిపారు. రైతులకు సంబంధించిన ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల ఆరోగ్య సమస్యలను సమయపాలన లేకుండా రైతులు పిలవగానే వెళ్లి వ్యాక్సిన్లు, టీకాలు, నట్టల మందులు, వ్యాధి నివారణ చర్యలు చేపడుతున్నార ని తెలిపారు. ఇందులో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని ప్రభుత్వం వారితో వెట్టిచాకిరి చేయించుకుంటుందన్నారు. ఇప్పటికైనా పశు మిత్రలను గుర్తించి వేత నం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు జిట్ట బోయిన సంధ్యారాణి, బక్క రాజేశ్వరి, సంఘీ అనిత, ఒర్రె రజిత పాల్గొన్నారు.