Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎక్సైజ్ అధికారుల పని తీరుపై ఎంపీపీ మండి పాటు
- ఉపాధ్యాయులు, వైద్యుల సమయ పాలనపై సభలో చర్చ
నవతెలంగాణ-గార్ల
మండల పరిధిలోని పలు గ్రామాలలో నాటు సారా విచ్చలవిడిగా అమ్ము తున్న ఎక్సైజ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఎంపిపి మూడ్ శివాజీ చౌహాన్ ఎక్సైజ్ అధికారుల తీరుపై మండిపడ్డారు. స్దానిక ఎంపిడివో కార్యాలయంలో శుక్రవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎంపిపి శివాజీ మాట్లాడుతూ మండలంలోని పినిరెడ్డిగూడెం, ఇతర ప్రాంతాలలో నాటు సారా తయారీ చేసి అమ్ముతున్న ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకుండా చుట్టపు చూపుగా వచ్చి ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా సం బంధిత అధికారులు నాటు సారా నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరా రు. ముల్కనూరు పిహెచ్సిలో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదని, ఇటీవల ఓ వ్యక్తి పాముకాటుకు గురికాగా అందుబాటులో వైద్యులు లేకపోవడంతో గత్యంతరం లేక పట్టణ ప్రాంతాలకు వెళ్ళి ప్రాణాలు కాపాడుకున్నా రని ఎంపిటీసి మాళోత్ వెంకట్ లాల్, గర్బిణి స్త్రీలలకు సేవలు అందించడంలో పిహెచ్సి సిబ్బంది నిర్లక్ష్యంగా వహిస్తున్నారని ఎంపిటీసి శీలం శెట్టి రమేష్ సభలో అధికారులను నిలదిశారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుండ రాకపోకలు సాగించడం వలన ప్రభుత్వ విద్య నీరు గారి పోతుం దని వెంకట్ లాల్ ఎఇవో పూల్ చంద్ దృష్టికి తీసుకురాగా వెంటనే చర్యలు చేపడ తామని హామీ ఇచ్చారు. విద్యుత్ కోతల వలన రైతులు అనేక ఇబ్బందులు పడుతు న్నారని సంబంధిత ఎఈ మహేందర్ బాబును సభ్యులు నిలదీశారు. ఇటివల ప్రభుత్వం నిర్వహించిన పోడు భూముల సర్వే పట్ల అధికారులు వ్యవహరించిన తీరు పట్ల శేరిపురం ఎంపిటీసి భట్టు నాగరాజు అసంతప్తి వ్యక్తం చేశారు. సీతంపేటలో నిరుపయోగంగా ఉన్న గోపాల మిత్ర కేంద్రాన్ని తిరిగి వినియోగం లోకి తేవాలని ఎంపిటీసి గుండె బోయిన నాగమణి అధికారుల దృష్టికి తీసుక వచ్చారు. కుటుంబంలో అర్హులైన వారందరికీ ఆసరా ఫింఛనులు అందించేలా ప్రభుత్వం కృషి చేయాలని జడ్పీటీసి జాటోత్ ఝాన్సీ లక్ష్మీ కోరారు. ఈ సమావే శంలో తహశీల్దారు ఈ.రాము, ఎంపిడివో రవీందర్, సర్పంచ్లు, ఎంపిటీసిలు అజ్మీర బన్సీలాల్, భూక్య మోతీలాల్, శ్రీను, డి.రాజకుమారి, పి.సుజాత, కో-అప్షన్ సభ్యులు ఖదీర్, అధికారులు కిషోర్ కుమార్, వంశీ, వసుంధర, నౌషిన్, సజన్ స్వరూప్, పి.జ్యోతి, సత్యనారాయణ, ఎల్లమ్మ, రజిని పాల్గొన్నారు.