Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గెలుపోటములు సహజం : జెడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి - దేశానికి యువశక్తి అవసరం : మాజీ ఎంపీ సీతారాంనాయక్
నవతెలంగాణ-స్టేషన్ ఘనపూర్
దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ముందు స్థానంలో ఉంచాలని, అభివృద్ధి, సంక్షేమం ఎజెండాగా సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని మాజీ ఉపమఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం కడియం ఫౌండేషన్ సహకారంతో కడియం యువసేన ఆధ్వర్యంలో 3వ సీజన్ ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ టోర్న మెంట్ 22 రోజులుగా 72 జట్లతో సాగిన ఈ పోటీల్లో మొదటి బహుమతి కంచ నపల్లి, ద్వితీయ బహుమతి ధర్మసాగర్ జట్లు గెలుపొందగా, విశిష్ట అతిథులుగా జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, మాజీ ఎంపి సీతారాం నాయక్ హాజరై బహు మతి ప్రధానోత్సవం చేశారు. ఈ సందర్భంగా క్రీడల కన్వీనర్, రాష్ట్ర రైస్ మిల్లర్స్ ఉపాధ్యక్షుడు, రూరల్ రైస్ మిల్లర్స్ అధ్యక్షుడు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు బెలిదే వెంకన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో కడియం మాట్లాడుతూ ఆలోచన చేయ డం కాదు, అమలు చేసే సంకల్పమే గొప్పగా సీఎం కేసీఆర్ భావిస్తారని మొదట గా గుర్తుచేశారు. అదే స్పూర్తితో 22రోజులుగా సాగిన ఆటల్లో ఏలాంటి విభేదాలు లేకుండా నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కడియం యువసేన బృందానికి అభినందనలు తెలిపారు. గడిచిన మూడేండ్ల కాలంలో క్రీడలను ప్రతీ ఏటా నియోజక వర్గ పరిధిలో ధర్మసాగర్, జాఫర్ఘడ్ మండలాల్లో జరిపి, నమిలిగొం డలో ప్రస్తుతం జరిగిన పోటీలలో 72జట్లు పాల్గొని, మొదటి, రెండో బహుమతి అందుకోవడం పట్ల ఇరుజట్లకు శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశమంతటా ఎలా అందించవచ్చోననే మోడల్ గా రాష్ట్రాన్ని పరిచయం చేస్తూ, బీఆర్ఎస్ జాతీయపార్టీగా ఏర్పాటు చేశారన్నారు. పార్టీ ఏర్పాటుతో విపక్షా లు భయపడ్తున్నరని, ఇక్కడ పథకాలు అమలు సాధ్యమైనప్పుడు, దేశంలో ఎందు కు కాదో, ఇవన్నీ అమలు చేసి సమాధానమివ్వాలని, లేదంటే తమపై విమర్శించే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. కడియం శ్రీహరి తెల్లకాగితమని ఉమ్మడి తెలు గు రాష్ట్రాలకు తెలుసునని, నీతి, నిజాయితీకి మారుపేరుగా, సహకారాన్ని అంది స్తున్నామని అన్నారు. కష్టపడే తత్వముంటే ఎదుగుతారని, అవకాశాలు అందిపు చ్చుకుని జీవితంలో స్థిరపడాలని, ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. పౌల్ట్రీ ఫామ్ స్వయం వ్యాపారంతో ఎదుగుతున్న వైస్ ఎంపీపీ సరితా నర్సింహ దంపతు లనును అభినందించారు. కోట్లు ఉన్న అదానీ, అంబానీ కంటే పదివేలుండి 2వేల సాయం చేసేవారు వారి కంటే గొప్పగా భావిస్తానని అన్నారు. ఉమ్మడి జిల్లాలో ఎవరికీ తన సాయం కావాలన్నా అందుబాటులో ఉంటానని తెలిపారు. దేశానికి యువశక్తి అవసరమని మాజీ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. ఆటలో గెలుపు ఓటములు సహజమని, క్రీడలతో పాటు, చదువు కూడా ముఖ్యమని, కేసీఆర్ క్రీడా కారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా గ్రంథాల య ఛైర్మన్ ఎడవెళ్ళి క్రిష్ణా రెడ్డి, సీనియర్ నాయకులు చింతకుంట్ల నరేందర్ రెడ్డి, పీఏసీఎస్ ఛైర్మన్ తీగల కర్ణాకర్ రావు, రైతు సమన్వయ సమితి జిల్లా నాయకులు మారుజోడు రాంబాబు,సర్పంచులఫోరం అధ్యక్షుడు పోగులసారంగపాణి, మామి డాల లింగారెడ్డి, వైస్ ఎంపిపి సరితానర్సింహ, సర్పంచులు డ్యాగల ఉప్పలస్వామి, కోతి రేణుకా రాములు, నాగరబోయిన మనెమ్మ, యాదగిరి, లోడేం రజిత, రవీం దర్, రుప్లానాయక్, గవ్వాని నాగేశ్వర్, అనిత సుధాకర్ బాబు, చిట్లస్వరూప, ఉపేం దర్, నవ్య, ఎర్రబెల్లి శరత్,అన్నెపు అశోక్, అయోధ్య, రమేష్, సంపత్‌రెడ్డి, రాజి రెడ్డి, ఎంపిటిసి బూర్ల లతా శంకర్, వెంకట స్వామి, రజాక్ యాదవ్, నర్సింహులు, దేవేందర్, ఏఎంసి మాజీ ఛైర్మన్ అన్నం బ్రహ్మరెడ్డి, సీనియర్ నాయకులు ఇల్లం దుల సుదర్శన్, మారేపల్లి క్రిష్ణ మోహన్ రెడ్డి, శ్యాం రెడ్డి,రాజేష్ నాయక్, స్వామి నాయక్, బానోత్ శారద, దాసరి అనిత, వంగాల జగన్మోహన్ రెడ్డి, జనగాం యాద గిరి, నీరటి ప్రభాకర్, కడియం యువసేన నాయకులు ఎల్మకంటి నాగరాజు, హఫీజ్, లోనే శ్రావణ్, బూర్ల రాజు, సుమన్ నాయక్, మహేష్ పాల్గొన్నారు.