Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
ప్రభుత్వ పథకాలు అవగాహనతో చేపడితేనే విజయవంతం అవుతాయని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రగ తి సమావేశ మందిరంలో తెలంగాణ క్రీడిపాంగణా లు, బహత్ పల్లె ప్రకృతి వనాలు, కంటివెలుగు కార్య క్రమాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో702 క్రీడా ప్రాంగణాలలో 90శాతం పూర్తి చేయడం జరిగిందని మిగతా క్రీడా ప్రాంగణాలను దాతల సహకారాన్ని కోరాలని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికా రులను ఆదేశించారు. జనవరి 18వ తేదీన రాష్ట్ర ప్ర భుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2వ విడ త కంటివెలుగు కార్యక్రమం అవగాహనతో ప్రణాళికా బద్దంగా చేపట్టి విజయవంతం చేయాలన్నారు.38 బృందాలు ఏర్పాటు చేశామని, సుమారు 10మంది తో వైద్యాధికారి, ఆప్తమాలజిస్ట్, హెల్త్ సూపర్ వైజర్, ఇద్దరు ఏ.ఎన్.ఎమ్స్, ముగ్గురు ఆశ కార్యకర్తలు బృం దంలో ఉంటారని, ప్రతిరోజు ఈబృందం300 మంది 18 సంవత్సరాల నుండి ఆ పై వయసున్న ప్రతి ఒక్క రికి కంటి పరీక్ష చేయాలన్నారు. పరీక్ష అనంతరం రీడింగ్ అవసరమున్న ప్రతి ఒక్కరికి అదే రోజు కళ్ళ జోడు అందజేయడం జరుగుతుందన్నారు. చూపు తీవ్రతను బట్టి అవసరమైన వారికి మందులు వ్రాయ డం, ఆపరేషన్లకు చర్య తీసుకోవడం జరుగుతుంద న్నారు. డిఆర్డిఓ శాఖ నుండి ఏపిఎమ్లు సిఏలతో, మెప్మా అర్బన్ సిబ్బంది సహకరించాలన్నారు. రవా ణా కొరకు అవసరమైతే వాహనాలు ఏర్పాటు చేయా లన్నారు. జిల్లా పంచాయతీ అధికారి గ్రామంలో వి స్తృత ప్రచారం చేస్తూ, ఇంటింటికి సమాచారం చేర వేయడమెగాక కంటి వెలుగు శిబిరంకు వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చిన వారి పూర్తి వివరా లు ఇంటి నెంబర్ సెల్ నెంబర్‌తో సహా తీసుకోవాల న్నారు. కంటి పరీక్షలు చేసేందుకు మిషన్లు అందు బాటులో ఉన్నాయన్నారు.ప్రోగ్రాం అధికారిగా డాక్టర్ అంబరీష్ ఉంటారని తెలిపారు. వైద్యాధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తారన్నారు.ఈ సమీక్ష సమా వేశంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, వైద్యాధి కారి హరీష్ రాజు, డిఆర్డిఓ సన్యాసయ్య, పంచాయ తీ అధికారి సాయిబాబా ఎంపిడివోలు పాల్గొన్నారు.
ఆయిల్ ఫామ్ విస్తరణతోటే రైతులు బలోపేతం..
ఆయిల్ ఫామ్ పంట విస్తరింప చేస్తేనే రైతాం గం బలోపేతం అవుతుందని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు.శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఆయిల్ ఫామ్ పంట విస్తరణ పై సంబంధిత అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ పట్ట విస్తరణకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయిల్ ఫామ్ మంచి ఆదాయం నిచ్చే పంటఅని,వరి,పత్తి వంటి పంటలను ప్రభుత్వం తగ్గిస్తున్నందున స్థిర ఆదాయాన్నిచ్చే పామాయిల్ పంట సాగు చేపట్టాలన్నారు. దేశవ్యాప్తంగా నూనెల కొరత ఏర్పడటంతో భారతదేశంసైతం ఆయిల్ పంట లపై దృష్టి సారించిందని, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో 6700 ఎకరాలకు లక్ష్యం గా పెట్టుకోవడం జరిగిందన్నారు.ఇప్పటివరకు 3300 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగుకు రైతులు ముందుకు వచ్చారని మరింత మంది ముందుకు రా వాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. విస్తరింప చేయాల్సిన ఆవశ్యకత అధికారులపై ఉందన్నారు.వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ అధికారులు సంయుక్తంగా సమ న్వయంతో రైతులను ప్రోత్సహించవలసిన అవసరం ఉందన్నారు క్షేత్రస్థాయిలో పర్యటించాలని పామాయి ల్ పంట సాగుపై అవగాహన పెంచేందుకు తొర్రూ రు మండలం హరిపిరాలలో 45 ఎకరాలలో ఏర్పాటు చేసిన నర్సరీని సందర్శింపచేయాలన్నారు. ప్రజాప్రతి నిధుల సహకారం తీసుకోవాలని సర్పంచులు, ఎంపి టిసిలతో రైతులకు పామాయిల్ పై అవగాహన పెం చినట్లయితే మరింత మంది రైతులు చేపట్టేందుకు ఆసక్తి చూపుతారన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన వి ధంగా లక్ష్యాలను రూపొందించుకొని నిర్ణీత సమ యంలో సాధించగలిగితే జిల్లాలో పామాయిల్ విస్త రణ మరింత వేగవంతంగా పుంజుకుంటుందన్నా రు. ఫలితాలు సాధిస్తేనే ప్రగతి ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కేవైసీ పథకాన్ని ప్రతి ఒక్క రైతుకు వర్తింప చేయాలన్నారు. విడతకు 2000 చొప్పున మూడు విడతలుగా 6000 రైతుకు అందుతాయన్నారు.ప్రభుత్వం అందించే లబ్ది అర్హులై న రైతుకు అందకపోతే చర్యలు తీసుకుంటామ న్నారు. ఈ కేవైసీ చేయించుకున్న ప్రతి రైతు బ్యాం కుకు వెళ్లి కేవైసీ చేయించుకోవాలని ఆధార్ లింకేజీ ద్వారా మంచి ఫలితాలు ఉంటాయన్నారు.జిల్లాలోని 98 343 మంది రైతులకు గాను 93 100 రైతులకు ఈ కేవైసీ చేసి 90శాతంతో ఉన్నామన్నారు. కేవలం 5243 మంది రైతులకు చేయించవలసి ఉందన్నారు. 1-1-2019 కి ముందుగా పట్టా భూములు ఉన్న రైతులు ఈ కేవైసీ పథకానికి అర్హులని పేర్కొన్నారు. సమీక్ష సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చత్రు నాయక్, ఉద్యాన శాఖ అధికారి సూర్యనారా యణ వ్యవసాయ సహాయ అధికారులు వ్యవసాయ అధికారులు వ్యవసాయ విస్తరణ అధికారులు ఉద్యా న శాఖ అధికారులు పాల్గొన్నారు.