Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి
నవతెలంగాణ-పర్వతగిరి
మండల కేంద్రంలోని పర్వతాల శివాలయం లో ఈ నెల 26, 27, 28 తేదీల్లో మూడు రోజులపాటు జరిగే పర్వతాలశివాలయం పున ప్రతిష్టాపన కార్యక్ర మం, జాతరకు భక్తులు అధిక సంఖ్యలో సందర్శించి పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని పంచాయ తీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వర్ధన్న పేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పిలుపునిచ్చారు. మం డల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోవారు మాట్లాడారు. కాకతీయుల కాలం లో నిర్మించి, 700 ఏళ్ల చారిత్రాత్మక ప్రాశస్త్యం కలిగిన పర్వతగిరి శివాలయ పునః ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఈనెల 26,27,28 తేదీల్లో మూడు రోజులపాటు అ త్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దాదా పురూ.15 కోట్ల వ్యయంతో ఆలయ పునః ప్రతిష్టాప న చేస్తున్నామని, దీనికి చుట్టుపక్కల ఉన్న గ్రామస్తు లంతా పెద్దఎత్తున తరలివచ్చి ఇంటినుంచి తెచ్చిన జలంతో శివుడికి అభిషేకం చేయాలని కోరారు. అ నంతరం పర్వతాల శివాలయానికి నూతనంగా ఏర్పా టు చేసినదాదాపు 700 మెట్లను ఎక్కి పరిసర ప్రాం తాలను భక్తుల వసతులను మంత్రి స్వయంగా పర్య వేక్షించారు. అనంతరం ఎలక్ట్రిసిటీ లైన్స్‌కు శంకుస్థా పన చేశారు. శివాలయానికి మూడు రోజుల్లో, వేలు, లక్షల్లో భక్తులు వస్తారని ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మం త్రి అధికారులను ఆదేశించారు. అలాగే పర్వతగిరి రి జర్వాయర్ను లోయర్‌మానేర్ డ్యాం నీటితో జాతర నాటికి నింపాలని దేవాదుల చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి ని మంత్రి ఆదేశించారు. రిజర్వాయర్‌లో భక్తుల ఆ హ్లాదం కోసం బోటింగ్ ఏర్పాటు చేయాలని టూరి జం శాఖ అధికారులను కోరారు. మూడు రోజుల పాటు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలనీ వైద్యా ధికారులకు సూచించారు. పర్వతాల శివాలయం జా తరకు వచ్చే భక్తులకు పర్వతగిరి నుంచి గుట్ట వరకు తగినని బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గుట్ట మీదికి వెళ్లడానికి వృద్ధులకు వాహన వసతి కల్పిస్తు న్నట్లు తెలిపారు.జాతరలో భక్తి భావం పెంపొందించే విధంగా శివుడి మీద పర్వతాల శివాలయం కోసం ప్ర త్యేకంగా పాటలు రాయించి నేడు విడుదల చేశా రు. జాతర సందర్భంగా సింగర్స్ సునీత, మంగ్లీ, మధు ప్రియలను రప్పించే ప్రయత్నం చేయాలని కమిటీ నిర్వాహకులకు సూచించారు.
భక్తుల రద్దీ నియంత్రణకు, పార్కింగ్ వసతుల కు పోలీసులు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొం దించుకోవాలనిచెప్పారు. ఇప్పటికే ముద్రించిన శివాల య జాతర కరపత్రాలను చుట్టుపక్కల ఉన్న గ్రామా లన్నింటికీ వెళ్లి ఇంటింటికి ఆహ్వానించాలని సూచిం చారు. జాతరకు వచ్చే భక్తులు తమ ఇంటి నుంచి గోదావరి జలాలు తీసుకొచ్చి శివునికి అభిషేకించా లని ప్రత్యేకంగా కోరారు.ఈ సమావేశంలో దేవాదా య , పంచాయతీ రాజ్, గ్రామీణ అభివద్ధి, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్, మిషన్ భగీరథ, పోలీస్, వైద్య ఆరోగ్య, ఇరిగేషన్, టూరిజం, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.