Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూర్ రూరల్
బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు హారి క రవీందర్ అన్నారు. మండలంలోని వెంకటాపురం, కేవుల తండా గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తమ పాఠశా లలో విద్యాబోధన చేస్తున్నామని తల్లిదండ్రులకు తెలిపారు. ప్రభుత్వం ఈనెల 18 వరకు ఇంటింటి సర్వే చేపడుతుందని అన్నారు. ప్రత్యేక కార్యచరణతో పాటు 6 నుండి 14 సంవత్సరాలు, 15నుండి 19 సంవత్సరాల వయసుగల డ్రాప్ అవుట్స్ పిల్లల వివరాలు సేకరించి స్థానిక పాఠశాలలో చేర్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఆర్పి రాధిక, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.