Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
పాకాల ఏటి పై హై లెవల్ బ్రిడ్జి ని ర్మాణంలో భాగంగా పాకాల ఏటి పరిసర ప్రాంతాలను రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ జిల్లా అధికారుల బృందం శనివారం పరిశీలించారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్ అండ్ బి ఈఈ తానేశ్వర్, డిఈ రాజేందర్, ఎఇ అనిల్ బృందం పాకాల ఏటి ఒడ్డుతో సహా పరిసర ప్రాంతాలను, హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి అనువైన ప్రాం తాలను క్షుణ్ణంగా పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. ఏటి పరివాహక ప్రాంతాల పరిశీలనకు వచ్చిన ఆర్ అండ్ బి అధికారులకు బ్రిడ్జి సాధన కమిటీ అధ్వర్యంలో నాయకులు కట్టెబోయిన శ్రీనివాస్, జడ సత్యనారా యణ, కె.ఈశ్వర్ లింగం, జి.వెంకటరెడ్డి, ఎ.వెంకటేశ్వర్లు, సర్పంచ్ కుసిని బాబు రావులు వరదల సమయంలో చెక్ డ్యాంపై ఈ ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బం దులను అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తిం చి ప్రభుత్వం త్వరితగతిన హై లెవల్ బ్రిడ్జి నిర్మాణంకు నిధులు మంజూరు చేసి నిర్మాణం చేపట్టేలా అధికారులు కృషి చేయాలని కోరారు.