Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి
నవతెలంగాణ-పెద్దవంగర
మండలంలో కొనసాగుతు న్న మన ఊరు-మనబడి పనుల ను త్వరగా పూర్తిచేయాలని ఎంపీ డీఓ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని గంట్ల కుంట గ్రామంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను సర్పంచ్ చింతల భాస్కర్ రావుతో కలిసి పరిశీలించారు. మన ఊరు-మనబడి పనుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని అన్నారు. నర్సరీలో హరితహారం మొక్కలకు సం బంధించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలోనే గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలకు డిజిటల్ బరువు కొలిచే యంత్రాలను అందజేస్తామన్నారు. పౌష్టికా హారం ప్రాముఖ్యతను గర్భిణీ స్త్రీలకు వివరించాలని అంగన్వాడీ టీచర్లకు సూచిం చారు. స్థానిక ఆరోగ్య వైద్య ఉపకేంద్రాన్ని సందర్శించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. త్వరలో ప్రారంభం కానున్న కంటి వెలుగు కార్యక్రమా న్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం విజరు కు మార్, పంచాయతీ కార్యదర్శి అశోక్, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, ఏఎన్ఎం సుంకరి ఈశ్వరి, అంగన్వాడి టీచర్లు పసుల స్వరూప, చింతల ఇందిర, ఆశ వర్కర్లు రాధిక, శోభ, తదితరులు పాల్గొన్నారు.