Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
మండల పరిధిలోని మర్రిగూడెం సమీపంలో ఉన్న వేట వెంకటేశ్వర దే వాలయం సమీపంలో నూ తనంగా ఏర్పాటు చేసిన సంతను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ భూక్య బుజ్జి, ఆలయ కమిటీ చైర్మన్ బానోత్ అమర్ చంద్ లు కోరారు. వేట వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సంతను శనివారం ప్రారంభించి మాట్లాడారు. మండలంలో సంత లేక పోవడం వలన పశువుల కొనుగోలు దారులు, వినియోగదారులు, ఇతర చిరు వ్యాపారులు వ్యయ, ప్రయాసలతో కూడిన ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నా యని అన్నారు. అందుబాటులో ఉన్న ఈ సంత వలన రవాణ ఖర్చులు, ప్రయాణ భారం తగ్గడమే కాకుండా సమయం కూడా ప్రజలకు కలసివస్తుందన్నారు. ఇక నుండి మండలంలో ప్రజలకు ప్రతి శనివారం సంత అందుబాటులో ఉంటుంద ని ఈ సంతను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్ర మంలో వైస్ చైర్మన్ బూడిద రాణి, దేవాలయ కమిటీ సభ్యులు యం.వెంకటేశ్వర్లు, సంత నిర్వహకులు తునగర్ విజరు, వెంకటేష్, గ్రామస్థులు పాల్గొన్నారు.