Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్ఘనపూర్
ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని భారత రాష్ట్ర సమితి పార్టీ మండల అధ్యక్షుడు మాచర్ల గణేష్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆదేశానుసారం మండల అధ్యక్షుడు అధ్యక్షతన శనివారం మండలంలోని మీదికొండ, రాఘవా పూర్, చాగల్ గ్రామ క్లస్టర్ పరిధిలో నాయకులు మాదిరెడ్డి రాఘవరెడ్డి, నాగర బోయిన శ్రీరాములు, కనకం గణేష్, జోగుకుమార్, మండల కస్టర్ ఇన్చార్జి కనకం రమేష్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పోగుల సారంగపాణి, మండల యూత్ అధ్యక్షులు గుండె మల్లేష్, గ్రామ శాఖ అధ్యక్షులు ఆకుల నరసింహ, మండల యూత్ ప్రచార కార్యదర్శులు గుండె రంజిత్ కుమార్, గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షులు చేపూరి కుమారస్వామి, గ్రామ యూత్ అధ్యక్షులు పొన్న రాజేష్, వార్డు సభ్యులు భాస్కుల స్వామి, కందుకూరి సురేష్, ఆధ్వర్యంలో పార్టీ ప్రత్యేక సమా వేశం నిర్వహించి, పార్టీ శ్రేణులకు పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీకి, ప్రజలకు వారధులుగా ఉండి, కేసీఆర్ పాలనలో ప్రజలకు అందిస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు అమలు తీరు, అభివృద్ధి పనులు గూర్చి గ్రామస్థాయిలో ప్రతీ ఒక్కరికీ వివరించే బాధ్యత గ్రామ, గ్రామాన 200మందికి ఒక్కరిగా నియమించిన క్లస్టర్ ఇంచార్జీలపై ఉందన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.