Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి.సంధ్య
నవతెలంగాణ-కేసముద్రంరూరల్
స్త్రీలపై జరుగుతున్న లైంగిక దాడులకు వ్యతిరేకంగా పోరాడాలి పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి.సంధ్య అన్నారు. కేసముద్రం మార్కెట్లో జిల్లా నాయకురాలు శివారపు శారద అధ్యక్షతన జరిగిన పిఓడబ్ల్యూ జిల్లా మూడో మహాసభలో పిఓడబ్ల్యు జాతీయ కన్వీనర్ వి.సంధ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ నాలుగు దశాబ్దాలకు పైగా స్త్రీ పురుష సమానత్వా న్ని, అన్ని రంగాలలో సమభాగ స్వామ్యాన్ని కోరుతు స్త్రీలపై సాగుతున్న అణిచి వేతను, శ్రమ దోపిడిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్త్రీల హక్కుల పరిరక్షణ కోసం, కుల, వర్గ, మత, జాతి వివక్షలకు వ్యతిరేకంగా నిరంతరం మహిళా ఉద్య మాలతో పాటు సమాజంలో సాగుతున్న అనేక సమూహల పోరాటాల్లో భాగస్వా మ్యం అవుతుందని సంఘీభావం తెలుపుతున్నదన్నారు. కేంద్రంలో బిజెపి హిందుత్వ పాసిస్తూ పాలన, నిరంకుశ, నియంతత్వ, రాక్షస పాలన నడుస్తుందని దీనికి వ్యతిరేకంగా మహిళలు ఉద్యమించాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమం లో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య, జిల్లా నాయకు లు మోకాళ్ళ మురళీకృష్ణ, పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుజ్జు కృష్ణవేణి, ఊకే పద్మక్క, ఆగబోయిన నర్సక్క, బట్టు బిన్నమ్మ, తుడుము అనురాధ, పొన్నం రమ, జక్కుల కొమరక్క, దాసరి సరూప, రామడుగు శ్యామల, అరుణోదయ కళా కారులు ఎడంపాక శ్రీశైలంచారి, హరీష్, బట్టు నాగేశ్వరరావు, కొట్టం అంజన్న, గుజ్జు దేవేందర్, బూర్క వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.