Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్
నవతెలంగాణ-మహాబూబాబాద్
అన్ని రకాల సరుకులను ఎగుమతులు, దిగుమతులు చేస్తూ సేవలు అంది స్తున్న హమాలీ కార్మికుల సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్ డిమాండ్ చేశారు. శనివారం పెరు మాండ్ల జగన్నాథం భవనంలో సిఐటియు పట్టణ కన్వీనర్ కుమ్మరికుంట్ల నాగన్న ఆధ్వర్యంలో కూరగాయల మార్కెట్ హమాలి కార్మికులు సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకులు రాజు, కుంట ఉపేందర్ సమక్షంలో సంఘంలో చేరినారు. వారికి కండువాలు కప్పి సంఘంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు హమాలీల శ్రమను దోచుకోవడం తప్ప వారి సంక్షేమానికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ దుర్మార్గమైన లేబర్కోడ్లు బిజెపి ప్రభుత్వం తెచ్చిందని తెలిపారు. కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా, అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు సాధన కోసం పోరాటాలు సాగుతున్నటువంటి సమయంలో మార్కెట్ హామాలి కార్మికులు సిఐటియులో చేరటం పోరాట శక్తిని మరింత పెంచుతుందని, చేరిన కార్మికులను అభినందించారు. సిఐటియులో చేరిన వారిలో సముద్రాల వెంకన్న, మధు, శ్రీను, సతీష్, నిరంజన్, ఉపేందర్, కృష్ణలతో పాటు హమాలీ కార్మికులు ఉన్నారు.