Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
జాతీయ స్థాయిలో విద్యార్థులు రాణించాలంటే ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు పోటీపరీక్షలలో తర్ఫీ దు పొందాలని, అందుకు సబ్జెక్టుల వారీగా పోటీల నిర్వహణ ఉపయోగపడతాయని జిల్లా పరిషత్ సీఈ వో ప్రసూన రాణి అన్నారు.జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన జిల్లా స్థాయి సోషల్ స్టడీస్ టాలెంట్ టెస్ట్‌లో విజేతలకు బహుమ తి ప్రధాన కార్యక్రమంలో సీఈవో ప్రసూన రాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో 147 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో తెలుగు మీడియం విభాగంలో పి.నికిత ప్రథమ స్థానంలో నిలవగా, ద్వితీయ స్థానంలో వి.భావన, తృతీయ స్థా నంలో డీ.జోత్న, ఇంగ్లీష్ మీడియం విభాగంలో ప్రథ మ స్థానంలో జి.సుస్మిత, ద్వితీయ స్థానంలో వి.హ రీష్, తృతీయ స్థానంలో ఏ.హరిని విజేతలుగా నిలి చారు. విజేతలకు ప్రసూనరాణితో పాటు, జిల్లా క్వాలి టీ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్ రెడ్డి, డిసిఇబి కార్యద ర్శి విజయమ్మ, పలువురు సాంఘిక శాస్త్ర ఉపాధ్యా యులు అభినందనలు తెలిపారు.ఉదయం జరిగిన ప్రశ్నాపత్రాల విడుదల కార్యక్రమంలో జిల్లా విద్యాశా ఖ అధికారి పాణిని పాల్గొని సాంఘిక శాస్త్ర ఉపాధ్యా యులు ఐక్యంగా ఇట్టి కార్యక్రమం చేయడం అభినం దనీయమన్నారు. పదవ తరగతి ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలుపుటకు ప్రతి ఒక్కరు కృషి చేయా లన్నారు. అనంతరం జరిగిన సోషల్ స్టడీస్ ఫోరం ములుగు జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోన్నారు. సోషల్ స్టడీస్ ఫోరం జిల్లా గౌరవ అధ్యక్షులుగా వేం యాకుబ్ రెడ్డి, అధ్యక్షులుగా బానోత్ దేవ్‌సింగ్, ప్ర ధాన కార్యదర్శిగా మద్దెల నాగేశ్వరరావు, గౌరవ సల హాదారులుగా గడల నాగేశ్వరరావు, గుండు రవి ప్రసాద్, అట్కరి ప్రమీలను ఇతర కార్యవర్గాన్ని ఏక గ్రీవంగా ఎన్నుకోన్నారు.