Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టూరిజం హబ్‌గా పాలకుర్తి - సీఎం కేసీఆర్ కృషితోనే దేవాలయాలకు పూర్వవైభవం - పర్యాటక కేంద్రాలుగా చారిత్రక ఆలయాలు
తెలంగాణ వారసత్వ సంపద పరిరక్షణ కోసం సీఎం కేసీఆర్ కృషి - రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ-పాలకుర్తి
కాకతీయుల కళావిశిష్టతకు పూర్వ వైభవం తీసు కువచ్చి, టూరిజం హబ్ లుగా తీర్చి దిద్దేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. టూ రిజం ప్యాకేజీలో పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్న మండలంలోని పాలకుర్తి, బమ్మెర, వల్మిడి, చెన్నూరు గ్రామాలను జిల్లా కలెక్టర్ సిహెచ్.శివ లింగయ్య, టూరిజం శాఖ ప్రత్యేక కార్యదర్శి మనో హర్ రావు, రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావుతో కలిసి సందర్శించి పనులను పరిశీలించారు. ఈ సం దర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ సీఎం కేసీ ఆర్ కృషితో రాష్ట్రంలోని దేవాలయాలకు, చారిత్రక క్షేత్రాలకు, కాకతీయ కళా విశిష్టతకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో గొప్ప కవులు పుట్టడం ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు దక్కిందన్నారు. మొట్టమొదటి గద్య రచయిత, నిజమైన ఆదికవి పాల్కూరి సోమనాథుని స్వస్థలం పాలకుర్తి కావడంతో పాటు కాకతీయుల కాలంలో నిర్మించిన చారిత్రక ప్రసిద్ధ ఆలయాలకు పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంగా విలసిల్లుతోందన్నారు. భాగవతాన్ని రాసిన పోతన పుట్టిన స్థలం బమ్మెర. రామాయణాన్ని రాసిన వాల్మీకి రచనలు చేసిన ప్రాంతం వల్మిడి అని గుర్తు చేశారు. చారిత్రక నేపథ్య మున్న దేవాలయాలు సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురై, శిథిలావస్థకు చేరుకుని, ఉనికి కనుమరుగవు తున్న క్రమంలో సీఎం కేసీఆర్ సహకారంతో తెలం గాణ వారసత్వ సంపదను, కాకతీయుల కళా విశిష్ట తను కాపాడేందుకు కృషి చేస్తున్నామన్నారు. దేవాలయాల అభివద్ధికి సీఎం కేసీఆర్ దాదాపు 50 కోట్ల రూపాయలు ప్రత్యేక నిధులు కేటాయించారని, మహా శివరాత్రికి పాలకుర్తి కళ్యాణ మండపం పను లు ప్రారంభించుకుంటున్నామని, 800 ఏళ్ల కింద ఇక్కడ పుట్టిన ఆది కవి పాల్కురికి సోమనాథుడనీ, సామాన్యులకు అర్థమయ్యే విధంగా రచనలు చేశా రనీ, సోమనాథుని విగ్రహం ఇక్కడ ప్రతిష్టిస్తున్నామ న్నారు. ఇక్కడ టూరిజం హరిత హౌటల్ నిర్మించ నున్నట్లు చెప్పారు. హౌటల్ కోసం స్థలం ఇచ్చిన దాతలకు ఇండ్లు నిర్మించి ఇస్తామని, టూరిజంలో ఉద్యోగాలు ఇస్తున్నామన్నారు. హరిత హౌటల్ 25 కోట్ల రూపాయలతో నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. శివరాత్రి నాటికి మరి న్ని పనులు చేసి పోతన క్షేత్రాన్ని ప్రారంభం చేసి, హౌటల్ శంకు స్థాపన చేసేందుకు మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్‌ను ఆహ్వానిస్తామన్నారు. పోత నని సమైక్యాంధ్ర రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోలేద ని, సీఎం కేసీఆర్ స్వయంగా బొమ్మెర ప్రాంతాన్ని సందర్శించి 15 కోట్ల రూపాయలు మంజూరు చేశార న్నారు. బొమ్మరలో 22 అడుగుల పోతన విగ్రహం తయారు చేస్తున్నామన్నామన్నారు. ఒంటిమిట్ట, భద్రాద్రికి ఆలయాలకు సమానంగా వల్మిడీ ఆలయా న్ని అభివృద్ది చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశారు, ఆర్డిఓ కృష్ణ వేణి, ఆర్అండ్బి ఎస్సి అల్లమనేని నాగేందర్ రావు, పిఆర్ ఎస్సి చంద్రశేఖర్ రెడ్డి, కాంట్రాక్టర్ నరసింహా రెడ్డి, ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, జెడ్పిటిసి శ్రీనివాస రావు, జెడ్పి కోఆప్షన్ మెంబర్ ఎండి మదర్, రైతుబంధు మండల కోఆర్డినేటర్ వీరమనేని యా కాంతరావు, ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్ కుమార్, వీరమల్ల బాబురావు , తహసిల్దార్ భూక్య పాల్ సింగ్ నాయక్, ఎంపీడీవో వనపర్తి అశోక్ కుమార్, అధికారులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామస్తులు పాల్గొన్నారు.