Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల అధ్యక్షుడు ఐలయ్య
నవతెలంగాణ-పెద్దవంగర
బీఆర్ఎస్ బలోపేతానికి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీరాం సంజరు కుమార్ కార్యకర్త లకు పిలుపు నిచ్చారు. శనివారం చిన్నవంగరలో పార్టీ అధ్యక్షుడు కొండపల్లి విజ యపాల్ రెడ్డి అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించి, బూత్ కమిటీ, కన్వీనర్లు ఎంపిక చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందని గుర్తు చేశారు. కేసీఆర్ పథకాలే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి ఎర్రబెల్లి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని దిశా నిర్దేశం చేశా రు. కార్యక్రమంలో మండల రైతు కోఆర్డినేటర్ పాకనాటి సోమరెడ్డి, నాయకులు జలగం శేఖర్, మాజీ జెడ్పీటీసీ జలగం వెంకటయ్య, మండల అధికార ప్రతినిధి బానోత్ సోమన్న, గ్రామ యూత్ అధ్యక్షులు బొమ్మెర నగేష్, విద్య కమిటీ చైర్మన్ జలగం యాకయ్య, పార్టీ కార్యదర్శి శివరాత్రి సోమనర్సయ్య, వార్డు సభ్యులు గూడెల్లి రజిత సోమయ్య, బొమ్మెర సోమన్న పాల్గొన్నారు.