Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనగామ ఆర్డీవో మధుమోహన్
నవతెలంగాణ-జనగామ
పట్టణంలోని వాటర్ ప్లాంట్లు చట్టబద్దంగా అనుమతులు తీసుకోవా లని నిబంధనల ప్రకారం ప్రామాణిక తలను పాటిస్తూ నిర్వహించాలని జన గామ ఆర్డీవో మధుమోహన్ అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తన కార్యాల యంలో వాటర్ ప్లాంట్ల యజమానులతో శనివారం ఆర్డీవో కార్యాలయంలో వాటర్ ప్లాంట్ల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూప్రతీ వాటర్ ప్లాంటూ బ్యూరో అఫ్ స్టాండర్డ్స్ వారి వద్ద నుండి అను మతి పొందాలన్నారు. వ్యాపారం చేసుకుని బ్రతికే హక్కు ఉందని తమ దృష్టిలో వ్యాపారులు ఒక విధంగా సమాజానికి సేవ చేసే వారీగా చూస్తామన్నారు. కానీ చట్ట బద్దం గా నియమాలు పాటించని వారిపై ప్రజా ఆరోగ్యం దృష్ట్యా కఠిన చర్య లు వుంటాయని ఆయన తెలిపారు. త్వరలోనే బిఎస్ఐ అధికార్లతో వాటర్ ప్లాంట్ల యజమానులకు ఒక అవగాహన సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. ఈ సమా వేశం లో పాల్గొన్న జనగామ జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం అధ్య క్షులు, న్యాయ వాది సాదిక్ అలీ మాట్లాడుతూ ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ప్రతీ వాటర్ప్లాంటూ బిఎస్ఐ అనుమతి తీసుకోవాలని ఆమేరకు హైకోర్టు ఉత్తర్వు ల కాపీలను వాటర్ ప్లాంట్ల యాజనులకు అందజేశారు. తదుపరి జరిగే సమా వేశంలోమున్సిపల్ కమిషనర్‌ను, ఆహార భద్రత అధికారిని భాగస్వామ్యం చేయా లని సాదిక్ అలీ ఆర్డీవోను కోరారు.ఈ కార్యక్రమంలో జనగామ వాటర్ ప్లాంట్ల సంఘం కార్యదర్శి తిరుమలరెడ్డి, వాటర్ ప్లాంట్ల యజమానులు పాల్గొన్నారు.