Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవంగర
అంగన్వాడీ కేంద్రాల ద్వా రా ప్రభుత్వం అందిస్తున్న సేవ లను శిశువుల తల్లిదండ్రులు, గర్భిణులు, చిన్నారులు సద్విని యోగం చేసుకోవాలని ఎంపీపీ ఈదురు రాజేశ్వరి ఐలయ్య అన్నారు. శనివారం చిట్యాల గ్రామంలోని మూడు అంగన్వాడీ కేంద్రాలకు డిజిటల్ బరువు కొలిచే యంత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. గర్భిణులు ఆకుకూరలు, గుడ్లు, పోషకాహారం తీసుకుంటేనే పిల్లలు ఆరోగ్యంగా జన్మిస్తారని అన్నారు. లోప పోషణ గల చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అంగన్ వాడీ కేంద్రాల్లో సకల సౌకర్యాలు కల్పించాలని టీచర్లకు సూచించారు. ఇంచార్జి సర్పంచ్ ఈదురు లచ్చమ్మ, పంచాయతీ కార్యదర్శి రాజు, పార్టీ అధ్యక్షుడు కొల్లూరి రమేష్, అంగన్వాడీ టీచర్లు పులుగుజ్జా రాజేశ్వరి, ఈదురు శోభ, పాక దుర్గ, బీఆర్ ఎస్ నాయకులు ఈదురుఅశోక్, ఈదురుయాదయ్య, పులుగుజ్జశోభ పాల్గొన్నారు.