Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యమాలను అన్చివేత కుట్రలో భాగమా!
- మండల సాధన సమితి నాయకులు
నవతెలంగాణ- ములుగు
అంచనాలు లేని గ్రామాలు మండలంగా ఏర్ప డుతుంటే మండల హామీ పై గెలిచిన మా నాయ కులు మాత్రం ఉద్యమాలను అణిచివేసే కుట్ర లతోనే పబ్బం గడుపుతున్నారని, చిత్తశుద్ది లేని స్థానిక నాయ కుల రాజకీయ స్వార్థంతోనే మండలం ఏర్పాటు ఆల స్యమవుతుందని మల్లంపల్లి మండల సాధన సమితి ఆదివారం ఆవేదన వ్యక్తం చేసింది. మల్లంపల్లి మం డల ఏర్పాటు కోసం మల్లంపల్లి మండల సాధన సమితి చేస్తున్న ఉద్యమ కార్యచరణలో భాగంగా నిర్వహించిన రిలే నిరాహార దీక్షలతో పాటు అనేక కార్యక్రమాలతో రాష్త్ర స్థాయి కార్యక్రమాలు చేశా మన్నారు. ఉన్నత స్థాయి మంత్రులు, అధికార సం బంధిత ఎమ్మెల్యేలను కలిసి విన్నవించామన్నారు. డాక్యుమెంట్ ద్వారా వినతి పత్రాన్ని మంత్రులు హరీష్రావు, కేటీఆర్కు అందించామన్నారు. సాను కూల స్పందనకు తమ ఉద్యమ కార్యచరణ తాత్కాలికంగా నిలుపుదల చేశామన్నారు. నాలు గేండ్లు గడిచినా మండలం ఏర్పాటు చేయడం లేదన్నారు. మల్లంపల్లి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు. మల్లంపల్లి మండల సాధన సమితి అధ్యక్ష కార్యదర్శులు నాయకులు గోల్కొండ రాజు కానుగంటి సతీష్ పోనుగంటి రవి ఎడ్ల అనిల్ రెడ్డి కుక్కల సంపత్ చందా రాము , మొహ్మద్ బాబుల్, బక్కీ నాగరాజు , నాయకుల ప్రభాకర్, చెన్నబోయిన మహేందర్, బక్కి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
మరో ఉద్యమం తప్పదు
జిల్లా యువజన విభాగం అధ్యక్షులు అన్న తిరుపతి
మల్లంపల్లి లక్ష్మీదేవి రాజుపేట గ్రామాలను మండలాలు చేయాల్సిందేనని వైయస్సార్ తెలంగాణ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు అన్న తిరుపతి ఆదివారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని అర్హతలు ఉన్న కూడా మండలాలు చేయకపోవడం అధికార పార్టీ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. పక్క జిల్లాలలో గోరి కొత్తపల్లి గ్రామాన్ని మండలం చేస్తే మన నాయకులు ఏం చేస్తున్నారని దుయ్యబట్టారు. సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పిటిసిలు రాజనామాలు చేసి మండలాల గురించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నారు. లేదంటే త్వరలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తామన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాదర్,ములుగు మండల అధ్యక్షుడు కొండ బోయిన దిలీప్, వెంకటాపురం మండల అధ్యక్షుడు బల్ల ప్రతాప్, నరేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.
మండలం గా ఏర్పాటు చేయాలి
జేఏసీ చైర్మన్ ముంజల బిక్షపతి గౌడ్
ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే మల్లంపల్లి మండలాన్ని ఏర్పాటు చేయాలని ముంజల బిక్షపతి గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ మల్లంపల్లి మండలం ములుగు జిల్లాతో పాటుగా 2018 నవంబర్ 30 న ములుగు ఎన్నికల ప్రచారం వచ్చిన కేసీఆర్ మల్లంపల్లి మండలం చేస్తామని హామీ ఇచ్చినారనీ, ఇచ్చినామీని తుంగలో తొక్కి హామీలేని గోరుకొత్తి పల్లి నీ మండలం చేసిన కెసిఆర్ కు మల్లంపల్లి మండలం గుర్తుకురావాలి కదా అని ప్రశ్నించారు. త్వరలో జరగబోయే ఎన్నికల లోపు మండలం చేయకపోతే ఉద్యమ పోరాట ఫలితంగా తప్పకుండా సాధిస్తామని జేఏసీ చైర్మన్ ఆయన అన్నారు. గతంలో కూడా 13 మండలాలు ప్రక టించిన కేసీఆర్ అప్పుడు కూడా మల్లంపల్లి మండలం మరిచి పోయినారనీ, కెసిఆర్ ఇచ్చిన హామీ మర్చిపోతారా మా సత్తా ఏమిటో ఎన్నికలలో నిరూపించుకుంటాం అని అన్నారు. ఇప్పటికైనా ఉద్యమ పోరాటం ఉదతం కాకముందే మల్లంపల్లి మండలం కెసిఆర్ ఇచ్చిన హామీ ప్రకారం మల్లంపల్లి మండలం చేయాలని ముంజల బిక్షపతి గౌడ్ డిమాండ్ చేశారు.