Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్‌పర్తి
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జేఎల్ నోటిఫికేషన్లో ఇచ్చిన వయోపరిమితిని 52ఎండ్లకు పెంచాలని తెలంగాణ (కాకతీయ)రాష్ట్ర ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సంకెపల్లి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక శ్రీచైతన్య డిగ్రీ కళాశాలలో జరిగిన టీపీసీఎల్ఏ జిల్లా కమిటీ సమావేశం లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 25 సంవత్సరాల నుండి మెగాస్థాయి జూనియర్ కాలేజి లెక్చరర్స్ నోటిప ˜ికేషన్ విడుదల కానందున అభ్యర్థుల వయోపరిమితి దాటి అర్హతను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరు ప్రైవేట్ కాలేజ్‌లలో పని చేస్తు ఇంట ర్మీడియేట్, ఎంసెట్, ఐఐటి, నీట్ లాంటి ప్రవేశ పరీక్షలలో కోచింగ్ ఇస్తు ప్రతిభా పాటవాలు కలిగి ఉన్నారని కాబట్టి వారిని ప్రభుత్వ రంగంలో ప్రవేశించే అవకాశం కల్పిస్తే ప్రభుత్వం ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయన్నారు. ప్రభుత్వ రంగంలో ఇంటర్మీడియేట్ విద్యా ప్రమాణాలు మెరు గవుతాయన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ కేటగిరిలలొ సుమారు ఒక లక్ష మంది నిరుద్యోగ యువత వయో పరిమితి 52సంవత్సరాలకు పెంచాలని కోరుతున్నారన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వయోపరిమితి పెంచాలని నిరుద్యోగుల కు న్యాయం చేయాలని కోరారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి, కె.చంద్రశేఖరరావు కు ఫాక్స్, మేయిల్ ద్వారా వినతి పత్రాన్ని పంపించారు. టీపీసీఎల్ఏ హాన్మ కొండ జిల్లా కమిటీ అధ్యక్షుడు ఎస్.రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వి.కుమార్, పట్టణ కమిటీ అధ్యక్షుడు సర్దార్ జ్యోతిసింగ్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆర్.సుదర్శన్, రాష్ట్ర సహాయ కార్యదర్శి వేల్పుల నాగశ్యామ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి వి.రాజేంద్ర ప్రసాద్, జిల్లా కమిటీ సభ్యులు శ్రీధర్, శివ కుమార్, సంపత్, తదితరులు పాల్గొన్నారు.