Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్‌పర్తి
చందుపట్ల శరత్‌రెడ్డి భూకబ్జాలను అరికట్టాలని ప్రజా సంఘాల నాయకులు అధికారులను డిమాండ్ చేశారు. దళిత బహుజన ప్రంట్ రాష్ట్ర కార్యదర్శి చుంచు రాజేందర్, తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి నాయకులు ఏలేందర్ భూ బాధి తులతో కలిసి కబ్జాకు గురైన భూమిని సందర్శించి మాట్లాడారు. మండలంలోని భీమారం రెవన్యూ శివారు సర్వే నెంబర్ 72/ఏ, 74ఏ, 74/బీలో ఇంద్రాక్షి బసవయ్యకి 1-20 ఎకరం భూమి ఉందన్నారు. దీనికి వారసుడైన ఇంద్రక్ష రమేష్ ఎటు వంటి విక్రయాలు జరుపకున్న, అక్రమంగా చందు పట్ల శరత్ రెడ్డి తన పలుకుబడిని, అధికార బలాన్ని ఉపయోగించి, ఇట్టి భూమిని నాన్ లేఔట్ కింద రిజిస్ట్రేషన్లు చేపించడం జరిగిందన్నారు. రమేష్ భూమిని అక్రమంగా కాజేసిన శరత్ రెడ్డిపై చర్యలు తీసుకుని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. సంబందిత జిల్లా కలెక్టర్, హసన్‌పర్తి తహాసిల్దార్లు స్పందించి, భూ కబ్జాదారుడైన శరత్ రెడ్డిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోని పక్షంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. బాధిత కుటుంబ సభ్యుల వెంట ప్రజా సంఘాల నాయకులు యాకూబ్, నరేష్, రాజు, చారి తదితరులున్నారు.