Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టేవాడ
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ అండ్ ప్రైవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ఆధ్వర్యంలో ఈనెల మూడవ తేదీన ప్రారంభమైన రవాణా రంగా కార్మికు ల సంఘర్ష యాత్రలో భాగంగా జీపు యాత్ర ఆది వారం వరంగల్ నగరంలోని రంగశాయిపేట ఏరి యాకు చేరుకుంది. ఈ ఈ సందర్భంగా రంగశాయి పేట సుందరయ్య ఆటో అడ్డా కార్మికులు యాత్రను ఘనంగా స్వాగతం పలికారు. ఈ యాత్రలో భాగం గా విచ్చేసిన ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ ఎస్.వీరయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ పుప్పా ల శ్రీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని సుమారు 20 లక్షల మందికిపైగా కార్మికులు రవాణా రంగంలో కార్మికులు పనిచేస్తున్నారు. ప్రధానంగా ఆటో టాక్సీ గూడ్స్ రవాణా స్కూల్ బస్సుల వంటి వాటిలో పనిచేస్తున్నారని, ఉన్నత చదువులు చదివి కష్టమైన పరిస్థితులలో ఏ దిక్కు లేక ఈ రవాణా రంగంలో స్వయం ఉపాధిని పొందుతూ జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. అలాంటి కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయకపోగా వివిధ రకా లుగా వేధింపులకు గురి చేస్తూ ఈ రంగంలో బ్రతక డం కష్టంగా మారుతుందన్నారు. రవాణా రంగం కార్మికుల పరిస్థితులలో మార్పులు చేయాలని, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని పెంచిన ఫైన్ లను తగ్గించాలని, అనువైన స్థలాలలో అడ్డాలను ఏర్పాటు చేయాలని, తదితర సమస్యలను పరిష్కరిం చాలని డిమాండ్ చేస్తూ ఈ రవాణా రంగా కార్మికుల సంఘర్షయాత్రను తెలంగాణ రాష్ట్రమంతా తెలంగా ణ పబ్లిక్ మరియు ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఒక జిల్లా కేంద్రం నుండి మరో జిల్లా కేంద్రం వరకు చేరుకునే దారులలో ఉన్న మున్సిపాలిటీలలో ఉన్న అడ్డాలను మరియు ఆర్టీసీ డిపోల వద్ద నిర్ణయిస్తున్నామని, 12 లక్షల మందికి పైగా పనిచేస్తున్న ఈ రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు లేదని, వీరు చిన్న చిన్న ప్రమాదం జరిగిన గాయపడినా అంగవైకల్య, అనారోగ్య పాలైన ఎటువంటి సహాయం అందడం లేదని, ఆ సమయంలో పని ఉండదు... ఆదాయం ఉండదు... కానీ ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. ప్రైవేట్ అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అప్పులు తీర్చలేక జీవితకాలమంతా ఆటో డ్రైవర్లు అనేక ఇబ్బందులను పడుతున్నారని అన్నారు. ఆల్ ఇండియా కమిటీ 2006 అప్పటి ప్రధానికి ఇచ్చిన వినతి పత్రం ప్రభుత్వానికి నివేదిస్తూ దేశవ్యాప్తంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఒక కార్మికుడికి పని చేస్తున్న చోట ఆ సంక్షేమ పథకాలను అమలు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసిందని, ఇందుకు నిధులను అమలు చేయాలని పదేపదే ప్రభుత్వాలకు సిఫార్సు చేసిన ఇందుకు అవసరమైన నిధులను ఎలా సమీకరించవచ్చో ప్రభుత్వాలను మనమే సూచించినా గత 15 సంవత్సరాలు గడిచిన నివేదిక అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మన పక్కన ఉన్న కేరళ రాష్ట్రంలో ఏర్పడ్డ వామపక్ష ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఒక సంక్షేమ బోర్డును ఏర్పా టు చేసిందని, తెలంగాణలో కూడా ఆ తరహా సంక్షే మ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశంలో ఉన్న అనేక రంగాల ట్రాన్స్పోర్ట్ కార్మికులను సమీక్షించి ఉద్యమాలు, ధర్నాలు చేస్తామ ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రావుల రమేష్, ఎండి మహబూబ్ పాషా, సుందరయ్య ఆటో యూని యన్ అధ్యక్షులు మొగుళ్ల అనీల్, కార్యదర్శి పొన్నం బాబురావు,కోశాధికారి ప్రభాకర్,సీఐటీయూ ఏరియా కమిటీ కన్వీనర్ గణేపాక ఓదెలు, గజ్జ చందుదాసు, రాజరాపు పెద్దరాజు, ప్రకాష్, గోళ్లేనా సంపత్ బొంత సంపత్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సాంబమూర్తి రామ సందీప్ తదితరులు పాల్గొన్నారు.