Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాయపర్తి
దాదాపు 20 సంవత్సరాల కిందట వారంతా కలిసి ఒకే పాఠశాలలో చదివా రు. తరువాత వివిధ రంగాల్లో స్ధిరపడ్డారు. ఆదివారం తిరిగి అదే పాఠశాలలో కలుసుకొని నాటి మధుర జ్ఞాపకాలను నెమరెసుకొని పంచుకున్నారు. దీంతో రాయపర్తి జడ్పీఎస్ఎస్ పాఠశాల అవరణం ఆనందపరవశంతో నిండింది. పాఠశా లలో 2002 - 2003 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు వారి ఆత్మీయ సమ్మేళనం అపూర్వంగా జరుపుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ కుటుంబసభ్యుల బాగోగులు తెలుసుకున్నారు. చదువుకున్న రోజుల్లోని జ్ఞాపకాలను పంచుకొని ఉబ్బి తబ్బిపోయారు. అందరూ కలిసి విందు భోజనాలు ఆరగించి గ్రూప్ పొటోలు దిగి కొత్త జ్ఞాపకాలను పదిలం చేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులు రఘునందన్ రెడ్డి, రాంనర్సయ్య, కష్ణమూర్తి, ఉపేందర్ రెడ్డి, భాస్కర్ రావు, వెంకటరత్నమాచార్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐత శ్రీనివాస్, గారె రఘుపతి, సుమన్, బొమ్మె ర నవీన్, అనిల్, గారె మహేందర్, శ్యామ్, అశోక్, రాజు, కుమార్, స్రవంతి, శిరీష, ఉమ, రజిత, రేణుక, తదితరులు పాల్గొన్నారు.
తొర్రూరు : తొర్రూరులో 23 ఏళ్ల అనంతరం పూర్వ విద్యార్థులు ఒకచోట చేరి సందడి చేశారు. మండల కేంద్రంలో ఉన్న జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదువు కున్న1999-2000 సంవత్సరం టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివా రం డివిజన్ కేంద్రంలోని తిరుమల ఫంక్షన్ హాల్ తొర్రూరులో ఘనంగా జరుపుకు న్నారు. సందర్భంగా గురువులతోపాటు విద్యార్థులు అప్పటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకొని ఆత్మీయంగా పలకరించుకున్నారు. అనంతరం హైస్కూల్ ప్రధా నోపాధ్యాయులు బివి రావు మాట్లాడుతూ చదివిన పాఠశాల అభివద్ధికి పూర్వ విద్యార్థులు కషి చేయాలని కోరారు. సమాజంలో ఉన్నత స్థానంలో ఎదిగేందుకు కషి చేయాలని కోరారు. గురువులు చూపించిన సన్మార్గంలో నడిచి మంచి గుర్తిం పును తీసుకురావాలని పిలుపునిచ్చారు.అనంతరం జడ్పీహెచ్ఎస్ పాఠశాల పూర్వ ఉపాద్యాయులు రామిరెడ్డి, సోమిరెడ్డి,సంజీవ్ రెడ్డి,లచ్చి రెడ్డి, సోమయ్య, రాజబాబు, ప్రస్తుత పాఠశాల హెచ్ఎం బివి.రావులను పూర్వ విద్యార్థులు ఘనం గా శాలువలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సలామ్, రమేష్, మల్లేష్, రచ్చ శ్రీను, సలామ్ పాషా, గుగులోతు రవీందర్, జె.స్వామి నాయక్, అలీ సాహెబ్, ఎడ్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
నెల్లికుదురు : 1976, 1977వ సంవత్సరం 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళన ఘనంగా నిర్వహించినట్లు పూర్వవిద్యార్థి ఆరిశ్రామిక వ్యాపార వేత్త వేముల బాబ్జి ప్రస్తుత గ్రంథాలయ జిల్లా అధికారి గుడి నవీన్ రావు ప్రస్తుత పిఎసిఎస్ చైర్మన్ చైర్మన్ కాసం లక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మండల కేంద్రం లోని అమూల్య గార్డెన్లో 1976-77వ పదో తరగతి బ్యాచ్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ నీటి రోజులను అధిగమిస్తూ సమస్యను ఎదుర్కొంటూ సమాజానికి సేవ చేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆనాటి గురువులకు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అక్కర పరిపూర్ణ చారి, నాగయ్య, కరుణాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
దేవరుప్పుల :మండలకేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1978 -79 మధ్య 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా అక్షర గార్డెన్స్‌లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు దేశ విదేశాలలోను, ప్రభుత్వ, ప్రయివేట్ స్వయం ఉపాధి రంగంలో స్థిరపడిన వారు ఆదివారం పాఠశాల ఆవరణంలో ఒకే చోట కలుసుకుని, పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. దాదాపు 43 ఏళ్ళ తరువాత ఈ ఆత్మీయ సమ్మే ళనం వారంతా ఏర్పాటు చేసుకున్నారు.నాటి చదువులమ్మ ఒడిలో నేడు గుర్తు కొస్తున్నాయి.అంటూ గత అనుభవాలను నెమరు వేసుకున్నారు. క్లాస్ మేట్స్, బెంచ్మేట్స్లతో ఆత్మీయ ఆలింగనంతో ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు.ఆనాటి విద్యార్థులకు చదువు చెప్పిన అప్పటి గురువులు మర్రి గోపాల్ రెడ్డి, బిల్లా సోమి రెడ్డి, వి.వెంకట్ రెడ్డి, ఈదునురి చంద్రారెడ్డి, యమ రామచంద్రయ్య సన్మానం చేసి మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో తమ స్నేహి తులు మంచి హోదాలో ఉండడం కొందరు స్వయం ఉపాధిలో మరికొందరు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో ఉండడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. అందరూ కలిసి సహపంక్తి భోజనాలు ఆరగించారు. పూర్వ విద్యార్థులు గ్రూప్ ఫొటోలు దిగి కొంగొత్త జ్ఞాపకాలు పథిలం చేసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో పూర్వ విద్యార్థులు అప్పీడి చంద్రారెడ్డి,బుక్క లక్ష్మయ్య, రాంరెడ్డి,గజ్జి లక్ష్మయ్య, మరాటి కష్ణమూర్తి,ఉప్పల్ రెడ్డి తీగల లక్ష్మయ్య, బిళ్ళ సోంరెడ్డి, జబ్బార్ తదితర పూర్వవిద్యార్థులు పాల్గొన్నారు.
జనగామ : విద్యార్థి దశలోని బాల్య స్మతిలో మరువలేవని పలువురు గత స్మతులను వెళ్లవేసుకున్నారు.గవర్నమెంట్ ఎయిడెడ్ ఏబీవీ హై స్కూల్ 1980- 81 బ్యాచ్ యొక్క పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం స్థానిక కామాక్షి ఫంక్షన్ హాల్ లో ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యా ర్థిని విద్యార్థులు గతంలో జరిగిన సంఘటన స్మరించుకొని ఆనందం పొందినారు ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి పూర్వ విద్యార్థులు రావడం గొప్ప విశేషమని స్కూల్ సెక్రెటరీ కరస్పాండెంట్ మహంకాళి హరిశ్చంద్ర గుప్తా అన్నా రు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం శోభ, కిరణ్ పూర్వ హెచ్ఎం వేణు మాధవ్, పూర్వ ఉపాధ్యాయులు సోమయ్య, ఆర్గనైజర్స్ గోపిశెట్టి శ్రీనివాసులు, బుస్సా లింగం, ఎర్రం సత్యనారాయణ, పబ్బ విజరు, సాదిక్, థామస్, పత్తి యాదిగిరి, చంద్రమౌళి, మాధవి, ఉదయ శ్రీ, స్వరూప, విజయలక్ష్మి, వావాణి పూర్వ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
రఘునాథపల్లి : మండలంలోని ఖిలాషాపురం జడ్పీ హైస్కూల్లో రెండు దశా బ్దాల అనంతరం పదవ తరగతి విద్యనభ్యసించిన 2001-2002 బ్యాచ్‌కు చెంది న పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆనాడు విద్యాబుద్ధులు నేర్పించిన ఆనాటి ఉపాధ్యాయులైన రాందాన్ శారదా చంద్రమోహన్, కొరయ్య దివాకర్, పరమహాత్మ హిమావతి నాగుర్ల నరసయ్య లను వారు ఘనంగా సత్కరించి పాదాభివందనం చేశారు. పూర్వ విద్యార్థులంతా ఒక్కచోట చేరి ఆనాటి గత స్మృతులను గుర్తుచేసుకుని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం వారి మనో భావాలను ఒకరినొకరు పంచుకుని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కుసుంబాయి తండా సర్పంచ్ దారావత్ రమేష్ నాయక్ పాగ ల శివ సాయి ప్రసాద్ ఏలేటి రంజిత్ రెడ్డి, సాయి శివప్రసాద్, రాజు, ధనుంజ రు, అశోక్, మధు, వాసవి, శ్రావణి ,హేమలత అనిత, రంజిత భాగ్యలష్మి కల్పనా సబితా రాధికా వాణిశ్రీ మీసాల వీరన్న, సట్ల తిరుపతి, కరుణాకర్, శివరాతి రాజు, ముప్పిడి రాజు, పెంతలా రాజు తదితరులు పాల్గొన్నారు.