Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ
నవతెలంగాణ-తొర్రూరు
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 5వ మహాసభలు రంగారెడ్డి జిల్లాలో జనవరి 13, 14 తేదీలలో నిర్వహించబడుతున్నాయని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ తెలిపారు. ఆదివారం స్థానిక హై స్కూల్ ఆవరణలో మహా సభల గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ మహాసభలో రాష్ట్ర విద్యా సదస్సు నిర్వహించబడుతుంది అని తెలిపారు. విద్యా సదస్సుకు మహాసభలకు ఉపాధ్యాయులు ఎక్కువ సంఖ్యలో హాజరై కార్యక్రమా న్ని విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుందని, మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాలల లో మెరుగైన సౌకర్యాలు ఏర్పడతాయని, ఆశించిన సాకారం కాలేదని, పాఠశాల ల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను డీఎస్సీ ద్వారా వెంటనే భర్తీ చేయాలని, అన్ని పాఠశాలల్లో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర మహాసభల్లో తీర్మానించి ప్రభుత్వానికి నివేదించడం జరు గుతుందన్నారు. ఈ మహాసభ ను తొర్రూరు డివిజన్ నుంచి ఎక్కువ సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరై జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో టిఎస్ యూటీఫ్ జిల్లా కోశాధికారి నాగ మల్లయ్య, జిల్లా కార్యదర్శులు బిక్షపతి,వెంకన్న నాయకులు రమేష్, యాకూబ్, వంశీ, పార్వతి, అజరు, లింగరాజు, వర కుమార్, రాయలు, నరసింహస్వామి, రాజన్న, వెంకటేశ్వర్లు, శేఖర్, వెంకన్న పాల్గొన్నారు.