Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నియోజకవర్గ కో ఆర్డినేటర్ గాదె పథ్వి
నవతెలంగాణ-లింగాలఘనపురం
ప్రజాశ్రేయస్సే జనసేన నినాదమని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, నియో జకవర్గ కో-ఆర్డినేటర్ గాదె పృథ్వి అన్నారు. ఆదివారం మండలంలో పర్యటిం చారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి జనసేన కార్యకర్తలతో కలిసి పూలమాల వేశారు. అనంతరం గౌడ సంఘం కమ్యూనిటీ హల్ నందు పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు.విలేకరులతో మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రజాశ్రేయస్సు కోరుకుంటుందని పేర్కొన్నారు. ప్రజాసమస్యల పట్ల పోరాటం చేస్తుందని తెలిపారు. మండలంలోని నెలపోగుల విద్యార్థులు బస్సు రవాణా సౌకర్యం కోసం ఇబ్బందుల పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలి పారు. ఈ సమస్య పరిష్కారానికి జనసేన కృషి చేస్తుందన్నారు. జనసైనికులు ప్రజల వెంట ఉండాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత పాలకులు వైఖరి పట్ల ప్రజలు విస్తుచెందారని పేర్కొన్నారు. నియోజకవర్గం మార్పు చెందాలంటే పాలకులు మారాలన్నారు.ప్రజా సమస్యల మీద పోరాడుతున్న జనసేన పార్టీని నియోజక వర్గ ప్రజలు ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు భైరపాక కపానంద్, గణేష్,చుక్క నవీన్, మహమ్మద్ రజాక్, పవన్, సాయి, వినయ్, రేవంత్, క్రాంతి, దుర్గాప్రసాద్, అభిరామ్, బోట్ల మధు తదితరులు ఉన్నారు.