Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జఫర్గడ్
కేంద్రంలో బీజేపీ కులాలను, మతాలను రెచ్చగొట్టడంతో దేశంలో అల్లర్లు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. మండల కేంద్రంలోని కోటి 36 లక్షలతో ఆర్అండ్బి టి రోడ్, సీసీ రోడ్డుకు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రాజయ్య ఆదివారం శంకుస్థాపన చేశారు. మండలంలోని తిమ్మంపేటలోని మహిళ కమిటీ హాల్, గౌడ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన చేయడం జరిగింది. అనంతరం మండల కేంద్రంలోని రడపాక సుద ర్శన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం దళితులను లెక్కచేయడం లేదని విమర్శించారు. రైతులను మోసం చేసిన ప్రభుత్వాలు బట్ట కట్టిన దాఖలు లేవని గుర్తు చేశారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం నల్ల చట్టాలు తీసుకువస్తే, రైతులు ఉద్యమాలు చేసి ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవడం జరిగిందని గుర్తు చేశారు. భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేని బిజెపి ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు, వృద్ధుల కు, వితంతువులకు, వికలాంగులకు, సంక్షేమ పథకాలతో అందరినీ ఆదుకుంటుం దన్నారు. తెలంగాణ రాష్ట్రంలాగా భారతదేశాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని సంకల్పంతో సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చడం జరిగిం దన్నారు. భారత దేశ ప్రజలు కెసిఆర్ పాలన కావాలని కోరుకుంటున్నారన్నారు. స్టేషన్గన్పూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దడం జరిగిందని తెలియ జేశారు. అనేక రిజర్వాయర్లతో నెలకొల్పి రైతు పంట పొలాలకు మూడు పంటల కు సరిపడా నీరందించడం జరుగుతుందన్నారు. నీటి ఎద్దడి నివారించడం కోసం మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నీరు అందించడం జరుగుతుందన్నా రు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రడపాక సుదర్శన్, జెడ్పీటీసీ ఇల్లందుల బేబీ శ్రీని వాస్, మార్కెట్ చైర్మన్ గుజ్జారి రాజు, వైస్ ఎంపీపీ కొడారి కనకయ్య, రైతుబంధు మండల కోఆర్డినేటర్ కడారి శంకర్, సర్పంచ్ బల్లెపు వెంకట నరసింహారావు, ఎంపీటీసీలు జ్యోతి రజిత యాకయ్య, ఇల్లెందుల మొగిలి స్రవంతి, యారా నీలమ్మ సోమిరెడ్డి, సర్పంచులు తాటికాయల అశోక్, పొన్నాల జ్యోతి నాగరాజు, ఇల్లందుల కుమార్, మండల పార్టీ అధ్యక్షులు పల్లెపాటి జయపాల్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ తాటికాయల వరుణ్, రాజ్‌కుమార్, గ్రామశాఖ అధ్యక్షులు సింగారపు శ్రీధర్, యూ త్ మండల అధ్యక్షులు తాటికాయల చేతన్, మహిళా మండల అధ్యక్షురాలు గోలి కవిత, టిఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.