Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కబడ్డీ క్రీడల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్
నవతెలంగాణ-స్టేషన్ఘనపూర్
నియోజక వర్గ పరిధిలోని చాగల్లు గ్రామంలో ఈనెల 12నుంచి రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలు కడియం ఫౌండేషన్ సహకారంతో స్వాగత్ యూత్ ఆధ్వర్యం లో నిర్వహించనున్న కబడ్డీ పోటీలను జయప్రదం చేయాలని ఒలంపిక్ క్రీడల అసోసియేషన్ టెక్నికల్ డైరెక్టర్, కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూసురు జగదీశ్వర్ యాదవ్ అన్నారు. ఈపోటీలు మండలంలోని చాగల్ గ్రామం లో జరుగనున్న నేపథ్యంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పోగుల సారంగపాణి సమక్షంలో ఆదివారం క్రీడా స్థల ఏర్పాట్లను సందర్శించి ఆటల నిర్వహణ తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ సూచన సలహాలు మేరకు క్రీడలు ఏర్పాటు చేశామని అన్నారు. కబడ్డీ ఆట ప్రపంచంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుందని అన్నారు. 47 దేశాల్లో కబడ్డీ పోటీలు కొనసాగుతూ వస్తున్నాయని తెలిపారు. ఆసియా క్రీడలలో భాగంగా ఇండియా గెలుపొంది ప్రత్యేక గుర్తింపు సాధించిందని అన్నా రు. రాష్ట్రంలో కూడా 3 సీజన్ ప్రీమియర్ లీగ్ పోటీలు నిర్వహించామని అన్నా రు. ఆటగాళ్ళు తమ జీవనోపాధిని ఎలా సంపాదించుకోవాలనే చింత లేకుండా ఆటపై పట్టు కలిగి, ఆర్థికంగా బలపడాలని పలు దశలుగా కబడ్డీ అసోసియేషన్ తరపున పోటీలు నిర్వహించి, చేయూత నివ్వడం జరుగుతుందన్నారు. 33 జిల్లా ల్లో అసోసియేషన్ ఏర్పాటు జరిగిందని, గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు నైపు ణ్యత, ప్రతిభ కనపర్చే విధంగా ఎల్లవేళలా సహకారం అందించి, ఉన్నత స్థితిలో ఉంచేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈనెల 12, 13, 14 న జరిగే రాష్ట్ర స్థాయి క్రీడలను క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అన్నారు. జిల్లా అధ్య క్షులు సారంగపాణి మాట్లాడుతూ క్రీడల్లో గెలుపొందిన జట్లను మొదటి బహుమ తిగా కడియం ఫౌండేషన్ సహకారంతో ఒక లక్ష, రెండో బహుమతి 50వేలు, 3వ బహుమతి 30వేలు, నాల్గవ బహుమతి 20వేలు, ఐదవ బహుమతి, ఆరవ బహు మతి పదివేల రూపాయల బహుమతి దాతల సహకారంతో అందజేయనున్నట్లు తెలిపారు. క్రీడాకారులకు ఆటలు ముగిసేంత వరకు సకల సౌకర్యాలు అందుబా టులో ఉంటాయని, అధిక సంఖ్యలోక్రీడాకారులు పాల్గొని క్రీడా పోటీలను విజయ వంతం చేయాలని అన్నారు. మరిన్ని వివరాల కోసం 9966868076, 9701949689, 9010255898, 9963863436, 9966638001 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కబడ్డీ అసోసి యేషన్ జాయింట్ సెక్రటరీ నర్సింగం, కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పోగుల సారంగపాణి, ప్రధాన కార్యదర్శి తోటకూరి గట్టయ్య, ఆర్ఆర్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్, రాష్ట్ర టెక్నికల్ బోర్డ్ కన్వీనర్ చంద్ర మోహన్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి అన్నెపు కుమార్, కోశాధికారి చింతకింది సుధాకర్, స్వాగత యూత్ అధ్యక్షుడు కూన రాజు, ఉపాధ్యక్షుడు దోమ ల రమేష్, ప్రధాన కార్యదర్శి కూన రమేష్, యూత్ అధ్యక్షుడు పొన్న రాజేష్, స్వా గత్ యూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.