Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
మండల పరిధిలోని వెంకట్రాంపురం బీఆర్ఎస్ గ్రామ శాఖ కార్యదర్శి దారా వత్ శివాజీ తండ్రి దారావత్ బద్రు నాయక్(68) ఆదివారం అనారోగ్య కారణంగా మృతి చెందడం జరిగింది. అదే విధంగా మండలంలోని బాలాజీపేటలో మృతి చెందిన గుగులోతు వల్మ మృత దేహాలకు బీఆర్ఎస్ నాయకులు పూల మాలలు వేసి నివాళ్లు అర్పించి వారి కుటుంబాలకు మనోదైర్యం కల్పించి ప్రగాఢ సాను భూతిని తెలిపారు.ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బత్తిని రాంమూర్తి గౌడ్, సొసైటీ వైస్ చైర్మన్ గంగుల సత్యనారాయణ, మండల పార్టీ ఉపాధ్యక్షులు తిరుమల ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఆత్మ కమిటీ సభ్యులు ఏనుగులు ఐలయ్య, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు రేఖ ఉప్పలయ్య, ఎంపీటీసీలు జర్పుల కవి త శ్రీను నాయక్, వజ్జా భద్రయ్య, బాలాజీపేట ఉప సర్పంచ్ తంగేళ్లపల్లి వీరభ ద్రం, నాయకులు వెంకన్న, తునికిపాటి నాగేందర్, మాలుసుర్, మురళి, మక్కు, ఇస్లావత్ వీరన్న తదితరులు పాల్గొన్నారు.
బద్రుకు విప్లవజోహార్లు ఎన్డీ...
సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సీనియర్ నాయకులు గ్రామ కమిటీ కార్యదర్శి దారావత్ బద్రు అకాల మరణం పట్ల సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సబ్ డివిజ నల్ కమిటీ విచారాన్ని వ్యక్తం చేస్తూ బద్రు మృతదేవం పై అరుణ పతాకాన్ని కప్పి విప్లవ జోహార్లు అర్పించింది. వారి కుటుంబానికి బంధు మిత్రులకు ప్రగాఢ సంతా పాన్ని సానుభూతిని తెలిపింది. అనంతరం రామచంద్రుల మురళి అధ్యక్షతన జరి గిన సంతాప సభను ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సబ్ డివిజనల్ కమి టీ కార్యదర్శి నందగిరి వెంకటేశ్వర్లు, ఇస్లావత్ లాలు టీచర్ మాట్లాడుతూ బద్రు చిన్నతనం నుండే సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సిద్ధాంతాలను అర్థం చేసుకొని పార్టీలో చేరి గత 30 సంవత్సరాలుగా అనేక ప్రజా పోరాటాల్లో రైతాంగ పోరా టాల్లో పాల్గొని ముఖ్యపాత్రను పోషించాడని అన్నారు. బయ్యారం పెద్ద చెరువు ఆయకట్టు రైతు కమిటీలో సభ్యునిగా కొనసాగుతూ చివరి పంట పొలాలకు నీరు అందించడంలో ముఖ్య పాత్రను పోషించాడని, ప్రజా సమస్యల పరిష్కారం కొర కు జరిగే ఉద్యమాల్లో విధిగా తాను హాజరయ్యేవాడని కొనియాడారు. బద్రు మర ణం వారి కుటుంబానికే కాకుండా ప్రజా ఉద్యమాలకు సిపిఐ ఎంఎల్ న్యూడెమో క్రసీ మండల ఉద్యమానికి తీవ్రం నష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్ర మంలో నందగిరి సత్యం, అజ్మీర తులసి, మాలోతు రాంజీ, ఇస్లావత్ శ్రీను, జాటో త్ బిక్షం, ఇస్లావత్ జయరాం, ఇస్లావత్ రాము, బొల్లం సోమక్క, అజ్మీరా సర్వణ్ తదితరులు పాల్గొన్నారు.