Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హన్మకొండ
సావిత్రిబాయి పూలే జయంతిని జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించాలని టీఎస్ యూటీఎఫ్ డిమాండ్ చేసింది. ఆదివారం జిల్లా విద్య శిక్షణ కేంద్రం డైట్లో వరంగల్, హనుమకొండ జిల్లాల యూటీఎఫ్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని ఉభయ జిల్లాల ఉపాధ్యక్షురాలు మర్రి అన్నా దేవి, ఎస్ జ్యోతి అధ్యక్షతన నిర్వహించారు. వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్ మాసపత్రిక సంపా దక వర్గ సభ్యురాలు డాక్టర్ ఏ విద్యాదేవి, రిటైర్డ్ అడిషనల్ కలెక్టర్ మోహన్‌లాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సావిత్రిబాయి పూలే తొలి మహిళా ఉపాధ్యాయురాలని అనానరు. బడుగు జీవుల చదువు కోసం, ప్రత్యేకంగా బాలికల చదువు కోసం అనేక వివక్షలను ఎదిరించి విద్య వ్యాప్తికి కృషి చేయడం జరిగిందని అన్నారు. ఇప్పటికీ అన్ని రంగాల్లో బాలికలు, మహిళల పట్ల వివక్ష కొనసాగుతోందన్నారు. దీనిని రూపుమాపేం దుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అనం తరం వరంగల్ హనుమకొండ జిల్లాల నుంచి 80 మంది మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ మరియు వరంగల్ జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం సదాశివ రెడ్డి, తాటికాయల కుమార్, పెండం రాజు, ఏ నిర్మల, గ్లోరీ రాణి, పి చంద్రకళ , సువర్ణ గ్రేస్, టీ పణి,ఎస్ రమాదేవి, ఉదయశ్రీ, డి అరుణ, సిహెచ్ రవీందర్ రాజు, సీఎస్ ఆర్ మల్లిక్, మెకిరీ దామోదర్, సి సుజన్ ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.