Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెేబీ ఆర్గానిక్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రవణ్‌కుమార్
నవతెలంగాణ- ములుగు
మిరప తోటలలో ప్రస్తుత పరిస్థితుల్లో ఉధృ తంగా కనిపిస్తున్న తామర పురుగుల నివారణ చర్య లు చేపట్టాలని కేబి ఆర్గానిక్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని వెంకటేశ్వర్లపల్లి, పోట్లాపూర్, పంచోత్క్లపల్లి, కొత్తూరు కాశి దేవి పేట గ్రామాల్లో కేబి ఆర్గానిక్స్ బృందం మిరప తోటలను పరిశీలించింది. ఈ సందర్భంగామ శ్రావణ్ కుమార్(టెక్నికల్) మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బంది సూచన మేరకు ఎరువులు, మందులు పిచికారి చేయాలని రైతులకు సూచిం చారు. ప్రతినిత్యం తోటను పరిశీలిస్తూ మార్పులను చూస్తూ నివారణ చర్యలు చేపడితే తామర పురుగుల నివారణ సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కేబీ ఆర్గానిక్స్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ బుచ్చిరెడ్డి రైతులు భూక్య పాప, జమలాపురం సాంబయ్య అజ్మీర రాజు రాజేందర్ గుగులోతు రతన్ సింగ్ గుగులోతు సంకర్ తదితరులు పాల్గొన్నారు.