Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్ఎఫ్ఐ డబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొరిమి కొరిమి సుగుణ
నవతెలంగాణ-భూపాలపల్లి
గీత ముఖర్జీ జీవితం నేటి తరానికి ఆదర్శనీ యమని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జిల్లా కార్యదర్శి కొరిమి సుగుణ కొనియాడారు. ఆదివారం స్థానిక రావి నారాయణరెడ్డి భవన్ లో గీతా ముఖర్జీ జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా గీతా ముఖర్జీ చిత్రపటానికి పూల మాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా సుగుణ మాట్లాడుతూ మహిళలలో చైతన్యం తేవడానికి మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని గీత ముఖర్జీ ఒక భారతీయ రాజకీయవేత్త , సామాజిక కార్యకర్తగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి మహి ళలను ప్రోత్సహించారని సిపిఐ అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్‌లోని పనస్కురా నియోజకవర్గం నుండి 1967 నుండి 1977 వరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, 1980 నుండి 2000 వరకు ఏడుసార్లు ఎన్నికయ్యా రన్నారు. ఆమె భారత కమ్యూనిస్టు పార్టీ మహిళా విభాగం అయిన నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ అధ్యక్షురాలిగా కూడా కొనసాగిందని అన్నారు. దేశంలోని పార్లమెంటరీ ఎన్నికల్లో మహిళలకు 1/3 వంతు రిజర్వేషన్ చట్ట సభల డిమాండ్‌కు ఆమె నాయ కత్వం వహించారని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు మోట పలుకుల సుజాత, నాయకులు అనిత, కంచ ఐలమ్మ, అన్నం రామ్, వెంకటమ్మ, తదితరులు పాల్గొన్నారు.