Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ మహదేవపూర్
మహాదేవపూర్ ఉమ్మడి మండలంలో కమ్యూ నిటీ ప్రోగ్రాం లో భాగంగా ముకునూర్ గ్రామంలో ఆదివారం ఎస్సై అరుణ్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో దేవరనేని రాజేశ్వర్రావు కిరాణా షాపులో విక్రయిస్తున్న అయిదు లీటర్ల గుడుంబాను సీజ్ చేయడం చేసి కేసు నమోదు చేశారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ గుడుంబా విక్రయిం చినా, తయారు చేసినా చట్ట పరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మావోలకు సహకరిం చవద్దని, ఎవరైనా అనుమానితులు కనిపిస్తే సమా చారం అందించాలన్నారు. కోడిపందాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ పార్టీ పోలీసులు, సివిల్ సిబ్బంది ఉన్నారు.