Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
సిఐటియు నిర్వహించిన ముగ్గుల పోటీలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం సంతోషదా యకంగా ఉందని 32వ డివిజన్ కార్పొరేటర్ పల్లం పద్మ రవి, సిఐటియు రాష్ట్ర శ్రామిక మహిళా నాయ కురాలు కాసు మాధవి, అన్నారు. కరీమాబాద్ సీఐ టీయూ ఆధ్వర్యంలో 32వ డివిజన్లో మహిళల మధ్య ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కా ర్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐటియు జిల్లా కా ర్యదర్శి ముక్కెర రామస్వామి తో విచ్చేసిన వారు పో టీలలో గెలుపొందిన మహిళలకు బహుమతులను అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ 32వ డివిజన్లో శ్రామిక వర్గానికి చెందిన మహిళలు ఎంతో మంది ఉన్నారని, పనులకు, పరిమితం కాకుండా కళా రూపాలకు దోహదం చేసే ముగ్గుల పోటీలలో పాల్గొని వారి ప్రతిభను తెలియజేయడం ఆనందంగా ఉందని అందుకు శ్రామిక మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు. ముగ్గుల పోటీలలో పాల్గొన్న విధంగానే పేద శ్రామిక మహిళలు వారికి దక్కాల్సిన హక్కుల కోసం మహిళలరక్షణ కోసం పాలకులతో పోరాడా లని పిలుపునిచ్చారు.
శ్రామిక మహిళలకు పనులులేక కనీసం వేతనం అమలుగాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని మహిళలపట్ల చిన్నచూపు చూస్తున్న సమా జం గానీ, ప్రభుత్వాలు గాని సరైన న్యాయం చేయలే కపోతు న్నారని ఆవేదన చెందారు. మహిళలను కేవ లం ఓటు హక్కుగా చూస్తున్నారని అన్నారు. ఇకనైనా ప్ర భుత్వం కళ్లు తెరిచే శ్రామిక మహిళలకు సంక్షేమ పథ కాలు డబుల్ బెడ్ రూములు వెంటనే మంజూరు చే యాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి ముక్కె ర రామస్వామి మాట్లాడుతూ పోటీలలో పాల్గొనడాని కి ముందుకు వచ్చిన శ్రామిక మహిళలకు సంక్రాంతి శుభాకాంక్షలు ముందస్తుగా తెలియజేశారు. మహి ళలు వంటింటికి పరిమితం కాకుండా ఆటలు పాటలు ముగ్గుల పోటీలలో నైపుణ్యాన్ని ప్రదర్శించడం శుభదాయకమని టీవీలకు సీరియల్ లకు వంటింటికి పరిమితం కాకుండా సమాజంలో ఉన్న అసమానత లను రూపుమాపడానికి ముందుకు రావడంతో పాటు చదువుల్లో రాణించి అన్ని రంగాలలో అభివద్ధి చెందాలని పిలుపునిచ్చారు. మహిళలను పుట్టనిద్దాం వారిని గౌరవిద్దాం, వారిని ఎదగనిద్దామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ స భ్యులు గున్నాల ప్రభాకర్, సీపీఎం కరీమాబాద్ ఏరి యా కన్వీనర్ మూడేళ్ల ఉపేందర్, సిఐటియు జిల్లా స హాయ కార్యదర్శి మీరు సాజియా, ఐద్వా అధ్యక్షురాలు అప్పాజీ వాణి కార్యదర్శి మాదాసి దివ్య శ్రామిక మహిళా కార్యదర్శి ప్రవళిక ఆర్పీలు కష్ణవేణి, పద్మ, ఎండి జుబేదా, మాసోబి యాకుబ్ పాషా ,మార్గం కిరణ్, రాఘవరెడ్డి, స్థానిక ఏరియా కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.