Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆత్మకూర్
అతివేగం అజాగ్రత్త వల్ల జరుగుతున్న ప్రమాదాల నివారణే పోలీసులు ల క్ష్యంగా పెట్టుకొని పని చేయాలనీ ఈస్టు జోన్ డిసిపి వెంకట లక్ష్మి సూచించారు. సోమవారం ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ జాతీయ రహదారి పై వాహనాల తని ఖీలను నిర్వహించిన అనంతరం పోలీసులకు పలుసూచనలు సలహాలను ఇచ్చారు. వాహనదారులు మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే క్రిమినల్ కేసులను నమోదు చేయాలనీ అన్నారు. వాహనాలకు రిజిస్ట్రేషన్,ఇన్సూరెన్స్,డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎవరైనావాహనాలు నడిపితే వారిపై కఠినచర్యలు తీసుకోవాల న్నారు. జాతీయ రహదారి కావడంతో వాహనదారులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని డిసిపిసూచించారు. రెగ్యులర్ గ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తూ ప్రమాదా ల నివారణ కోసం నిరంతరం నిర్వహించాలన్నారు. వాహనదారులు ఎవరైనా మద్యం సేవించి నడిపినట్టయితే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. యువకులు అతివేగం,అజాగ్రత్త వాహనాలు నడుపుతున్నారని వారి పై ద్రుష్టి సా రించి కేసులు నమోదు చేస్తే భవిషత్తులో ఎలాంటి ఉద్యోగాలు రావన్నారు యు వత పోలీసులకు సహకరిస్తూ జాగ్రత్తగా వాహనాలను నడపాలని ప్రతిఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడుపవద్దని అన్నారు. నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేయాలనీ పోలీసులకు సూచించారు. ఈ వాహనాల తనిఖీలలో పరకాల ఏసిపి శివరామయ్య,ఆత్మకూరు సిఐ గణేష్,పోలీసులు తదితరులు ఉన్నారు.