Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.20లక్షలతో జీపీ భవనాలకు శంకుస్థాపన
నవతెలంగాణ-ఆత్మకూర్
దేశంలో గుణాత్మక మార్పు రావాలంటే కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూరు మం డలంలోని మల్కపేట, హౌసుబుజుర్లు గ్రామాల్లో రూ.20లక్షలతో నూతనంగా గ్రామ పంచాయితీ భవనాలకు శంకు స్థాపన చేశారు. ఈసందర్భం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో అమలవుతున్న అభివద్ధి సంక్షేమ పథకాలు దేశమంతా విస్తరించాలనే అకాంక్ష ప్రతి ఒక్కరిలోనూ ఉన్నదని. ధర్మారెడ్డి అ న్నారు. దేశంలో ఉన్న సంపద ప్రజలందరికి అందాలనే దఢ సంకల్పంతో బీఆర్ ఎస్ ముందుకు సాగుతుందన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానీకి ఉద్యమ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ నడుం కట్టారని కొనియాడారు. బీజేపీ నాయకులు నోటికి ఏది వస్తేఅది మాట్లాడటం ఫ్యాషన్‌గా మారిందని ఎద్దేవాచేశారు.ఫ్యాన్షన్స్ వస్తుపో తుంటాయని అలాంటి వారిని పట్టించుకోవద్దన్నా రు. బీజేపీ నాయకులు కుట్రల ను ప్రతి ఒక్క కార్యకర్త తిప్పి కొట్టాలన్నారు. గ్రామాల్లో బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తే, వారిని నిలదీయాలన్నారు.
ఈకార్యక్రమంలో ఎంపీపీ మార్క సుమలతరజనీకర్, జడ్పీటీసీ కక్కెర్ల రాధికా రాజు, సర్పంచ్‌లు మాడిశెట్టి వేణుగోపాల్, రబీయాబీహుస్సేన్, రెడ్ క్రాస్ డైరెక్టర్ దుంపల్లపల్లి బుచ్చిరెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మెన్ అంబాటి రాజస్వామి, డీఈ లింగారెడ్డి, రైతు మండల కో-ఆర్డినేటర్ రవీందర్, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.