Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తలోదారి... బీఆర్ఎస్ శ్రేణుల్లో అయోమయం..
- 12న మానుకోటకు సీఎం
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి /మహబూబాబాద్
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ పట్టణానికి ఈనెల 12న సీఎం కేసీఆర్ రానున్నారు. జిల్లా బిఆర్ఎస్లో మంత్రి సత్యవతిరాథోడ్, ఎంపి కవిత, ఎమ్మెల్సీ రవీందర్రావు, ఎమ్మెల్యే శంకర్నాయక్లది తలోదారి కావడంతో సీఎం పర్యటన ఎలా జరుగుతుందోనన్న ఆందోళన సగటు బిఆర్ఎస్ శ్రేణుల్లో వుంది. మహబూబాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సముదా యం తోపాటు మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, బిఆర్ఎస్ జిల్లా కార్యాలయం, గ్రం ధాలయం, డబుల్ బెడ్రూం ఇండ్లను సీఎం ప్రారంభించాల్సి వుంది. జిల్లా బీఆర్ ఎస్‌లో ప్రజాప్రతినిధుల మధ్య సయోధ్య కరువవడంతో సీఎం ఎన్ని ప్రారంభి స్తారన్నది సందేహాస్పదంగా మారింది. బహిరంగసభ కూడా వుంటుందా ? లేదా ? అన్న అనుమానాలు సైతం వున్నాయి. జిల్లా బిఆర్ఎస్లో పరిస్థితులను చక్క దిద్దడానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును రంగంలోకి దించే అవకాశం లేకపోలేదు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 12న సీఎం కేసీఆర్ పర్యటించను న్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారు. జిల్లా బిఆర్ఎస్లో ప్రజాప్రతినిధుల మధ్య వున్న విభేదాలతో పలు సందర్భాల్లో సీఎం జిల్లా పర్యటన వాయిదా పడుతూ వచ్చింది. జిల్లాకు చెందిన గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ కవిత, ఎమ్మెల్సీ రవీందర్రావు, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ల మధ్య సయోధ్య లేదు. వీరి మధ్య విభేధాలతో బిఆర్ఎస్ శ్రేణుల్లో సైతం గందరగోళం నెలకొంది. పార్టీలో ఎవరి వర్గం వారిదే కావడంతో మంత్రి సత్యవతికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీరందరినీ సమన్వయంతో నడపడం కత్తి మీద సాములా మారింది. ఈ క్రమంలో పలు సందర్భాల్లో సీఎం పర్యటనకు ఏర్పాట్లు చేసినా, ఆయన జిల్లా పర్యటనకు రాలేదు. ఈనెల 12వ తేదీన సీఎం పర్యటన ఖరారవడంతో ప్రజాప్రతినిధులు ఏర్పాట్లలో తలమునుకలయ్యారు.
సయోధ్యకు ప్రయత్నం..
సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం సాయంత్రం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్సీ రవీందర్రావు, ఎమ్మెల్యే శంకర్‌నాయక్ తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా విభేధాలను పక్కనపెట్టి సీఎం పర్యట నను విజయవంతం చేయాలని మంత్రులు ప్రజాప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు ఉద్బోధించారు. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రులు ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేతోపాటు పార్టీ నేతలకు హితవు పలికారు.
బహిరంగసభ నిర్వహణపై సందేహాలు..?
మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో సీఎం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాల్సి వుంది. ప్రస్తుతం కలెక్టరేట్ భవన సముదా యాన్ని మాత్రమే ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. మిగతా కార్యక్రమాలను ఖరారు చేయాల్సి వుంది. ఇదిలావుంటే ఇక్కడ బహిరంగసభను ఏర్పాటు చేసే విష యంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత మహబూబాబాద్ జిల్లా పర్య టన ముగించుకొని సీఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ పర్యటించాల్సి వుంది. దీంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బహిరంగసభ పెట్టే అవకాశం లేదని ప్రచారం జరుగుతుంది. జిల్లాలో పోడు సమస్య అధికంగా వుండడం, ఇప్పటికీ సీఎం హామిని నిలబెట్టుకోకపోవడంతో బహిరంగసభను ఇక్కడ నిర్వహించక పోవ చ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 1.20 లక్షల ఎకరాల అటవీ భూములుండగా, 34 వేల మంది రైతులు 60 వేల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటికీ ఈ సమ స్యను పరిష్కరిం చకపోవడంతో బహిరంగసభను నిర్వహించకపోవచ్చన్న ప్రచార ముంది. భద్రాద్రి కొత్తగూడెంలోనే బహిరంగసభను నిర్వహిస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది.
ప్రారంభోత్సవాలపై సందేహాలు..
బిఆర్ఎస్ జిల్లా కార్యాలయంతోపాటు, నూతనంగా మెడికల్ కాలేజీ తర గతులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ రెండింటిని కూడా ప్రారంభించాల్సి వుంది. బిఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మెడికల్ కాలేజీ తరగతుల ప్రారంభంపై సందేహాలు వ్యక్తమవుతు న్నాయి. సీఎం కేసీఆర్ మహబూబాబాద్‌లో బహిరంగసభలో ప్రసంగిస్తారా ? లేదా ? అన్న విషయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్ ప్రాంగణంలోనే అన్ని ప్రభుత్వ కార్యాలయాలను రూ.62 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు. ఈ భవనం ప్రారంభోత్సం సీఎం చేతుల మీదుగా జరుగనుందని ఇప్పటికే ఖరారైంది. మిగతా అభివృద్ధి కార్యక్ర మాల ప్రారంభోత్సవాలు నేటికీ ఖరారు కాకపోవడం అనుమానాలకు తావిస్తుంది. పట్టణంలో రూ.5 కోట్ల అంచనా వ్యయంతో కొత్త గ్రంధాలయాన్ని నిర్మించారు. బిఆర్ఎస్ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవానికి ఎదురుచూస్తుంది. రూ.530 కోట్ల అంచనా వ్యయంతో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, హాస్టల్స్‌ను నిర్మించాల్సి వుంది. ఇందులో కేవలం నర్సింగ్ కాలేజీ నిర్మాణం మాత్రమే పూర్తయ్యింది. ప్రస్తు తం మెడికల్ కాలేజీ భవన నిర్మాణం పూర్తి కాకపోవడంతో నర్సింగ్ కాలేజీలోనే మెడిసిన్ విద్యార్థుల మొదటి బ్యాచ్‌కు తాత్కాలికంగా తరగతనులను నిర్వహి స్తున్నారు. మెడికల్ కాలేజీకి వెళ్లడానికి ఆర్ అండ్ బి రోడ్డు నుండి కాలేజీ వెళ్ల డానికి రోడ్డును సైతం నిర్మించలేదు. సగం వరకే సిసి రోడ్డు నిర్మించి వదిలేశారు. దీంతో దీని ప్రారంభోత్సవం వుంటుందా ? లేదా ? అన్న అనుమానాలున్నాయి. పట్టణంలోని వేల్పుల సత్యంనగర్లో నిర్మించిన 180 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించాల్సి వుంది. ఈ అభివృద్ధి కార్యక్రామాల్లో ఎన్ని ప్రారంభిస్తారనే విషయంలో చివరి వరకు ఉత్కంఠ తప్పకపోవచ్చు.