Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టోల్ వద్ద ప్రత్యేక వే..
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసి అధికారులు 800 స్పెషల్ సర్వీ సులను నడుపనున్నారు. ఇందుకు ఆర్టీసి అధికా రులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈనెల 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు రోజుకు 70 బస్సులను అదనంగా నడిపిస్తున్నారు. మొత్తంగా 350 నుండి 400 సర్వీసులను నడుపనున్నారు. 14వ తేదీన డిమాండ్ వుంటే ఆ రోజు కూడా బస్సులు అదనంగా నడిపిం చడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అదే విధంగా పండుగకు వెళ్లిన వారి తిరుగు ప్రయాణం సౌకర్యార్ధం ఈనెల 16వ తేదీ నుండి 19వ తేదీ వరకు అదనపు ఆర్టీసి బస్సులను నడుపనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఆన్లైన్ రిజర్వేషన్లో డిమాండ్కనుగుణంగా అదన పు బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. సంక్రాంతి పర్వ దినం సందర్భంగా పాఠశాలలకు సెలవులు ప్రకటిం చిన దరిమిలా స్కూల్స్ విద్యార్థుల సౌకర్యార్ధం నడిపే బస్సులను ఈ పండుగ సందర్భంగా వినియోగించ నున్నారు.
రోజుకు 70-80 సర్వీసులు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 9 ఆర్టీసి డిపో లున్నాయి. ఒక్కో డిపో నుండి సంక్రాంతి పండుగ సందర్భంగా 10 సర్వీసులను అదనంగా నడిపిస్తు న్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రోజుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 70 నుండి 80 అదనపు సర్వీసులను నడుపుతాము. డిమాండ్‌ను బట్టి ఈ సర్వీసులను పెంచే అవకాశం కూడా వుంది. సం క్రాంతి పండుగ సందర్భంగా ప్రజల సౌకర్యార్ధం ప్రయాణంలో ఆలస్యాన్ని నివారించడానికి టోల్ గేట్ వద్ద (కోమల్ల) హన్మకొండ నుండి హైద్రాబాద్‌కు వెళ్లే దారిలో 7వ లేన్, హైద్రాబాద్ నుండి హన్మకొండకు వచ్చే సందర్భంగా 6వ లేన్‌ను ఆర్టీసి బస్సుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రతి డిపో నుండి 10 అదనపు సర్వీసులను నడపడానికి ఏర్పాట్లు చేశాం.
- జె శ్రీలత,ఆర్టీసీ ఆర్ఎం